Prabhas | ప్రభాస్ తో సినిమా చేయనున్న ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు
‘రాధేశ్యామ్’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కథలో కొత్తదనం లేకపోవడంలో ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు. నిర్మాతలకు ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరాజయం నుంచి తేరుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవలే దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. కథ మొత్తం ఓ భవంతి చుట్టూ తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో బిల్డింగ్ సెట్ వేస్తున్నట్లు తెలిసింది.
ఈ సినిమాను ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా వారి స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య వచ్చిచేరినట్లు సమాచారం. అతడు ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. కథానుగుణంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు స్థానం ఉన్నట్లు సమాచారం. ఈ పాత్రల కోసం రాశీఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీలలను ఎంపికచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే తో పాటు బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్ లో నటిస్తున్నారు.
టాపిక్