Ponniyin Selvan Now Streaming In OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ - ఫ్రీ స్ట్రీమింగ్ లేదు
Ponniyin Selvan Now Streaming In OTT: పొన్నియన్ సెల్వన్ -1 సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే...
Ponniyin Selvan Now Streaming In OTT: పొన్నియన్ సెల్వన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (శుక్రవారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మణిరత్నం (Maniratnam) కలల ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
తమిళంలో 200 కోట్లకుపైగా గ్రాస్ సాధించిన మొదటి తమిళ సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. వరల్డ్‌వైడ్‌గా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా పొన్నియన్ సెల్వన్ సినిమాను ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా సైలెంట్‌గా నేడు ఓటీటీలో రిలీజ్ చేశారు.
అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండటంతో పాటు అదనంగా 199 రూపాయలు చెల్లిస్తేనే ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉంటుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్ రిలీజ్ కాలేదు.
కాగా ఫ్రీ స్ట్రీమింగ్ నవంబర్ 4 నుంచి ఉంటుందని చెబుతున్నారు. రిలీజ్‌కు ముందే భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు.
చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందరచోళుడితో పాటు అతడి కుమారులు కరికాళచోళుడు, పొన్నియన్ సెల్వన్ జీవితాల్లో జరిగిన సంఘటనలతో ఎమోషనల్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. తమకు ఎదురైన కష్టాల నుంచి వారు ఏ విధంగా బయటపడ్డారు? వారిపై కుట్రలు పన్నినదెవరన్నది పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1లో చూపించారు మణిరత్నం.
ఆ కుట్రలను ఎలా తిప్పికొట్టారన్నది రెండో భాగంలో చూపించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్రమ్ (Vikram), జయంరవి (Jayam ravi), కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష (Trisha), ప్రకాష్‌రాజ్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించాడు.
లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మించాడు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.