Mahesh Babu: రీ రిలీజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న మహేష్‌బాబు పోకిరి
మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న పోకిరి సినిమా రీ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే అన్ని షోస్ హౌస్ ఫుల్ అయి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
మహేష్‌బాబు కెరీర్‌లో పోకిరి లాండ్‌మార్క్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా నే టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా మహేష్ ను నిలబెట్టింది. అతడి లోని హీరోయిజాన్ని డిఫరెంట్ స్టైల్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ పోకిరిలో ఆవిష్కరించారు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్ట్ 9న మహేష్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. తొలుత కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అభిమానుల రెస్పాన్స్ అంతకంతకు పెరగడంతో స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వచ్చారు.
ఇండియాతో పాటు ఓవర్‌సీస్‌లో కలిసి 135 స్క్రీన్స్‌లో పోకిరిని 4 కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు. అత్యధిక సెంటర్స్ లో రెండోసారి రిలీజ్ అవుతున్న సినిమాగా పోకిరి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ రీ రిలీజ్‌కు మూడు రోజుల ముందే అన్ని షోల టికెట్స్ అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్స్ అన్నింటిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలో పలు నగరాల్లో అడ్వాన్ప్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ద గంటల్లోనే థియేటర్స్ హౌజ్‌పుల్ అయ్యాయి.
అమెరికాలో దాదాపు పదిహేడు ప్రాంతాల్లో 24 థియేటర్లలో పోకిరి స్క్రీనింగ్ కాబోతున్నది. రిలీజ్ అయ్యి పదహారేళ్లు అయినా సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదనడానికి అడ్వాన్స్ బుకింగ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించబోతున్నారు.
టాపిక్