Poacher Web Series trailer: ఓటీటీలోకి వస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్.. పోచర్ ట్రైలర్ చూశారా?-poacher web series trailer released crime series to stream in amazon prime video from february 23rd ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Poacher Web Series Trailer: ఓటీటీలోకి వస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్.. పోచర్ ట్రైలర్ చూశారా?

Poacher Web Series trailer: ఓటీటీలోకి వస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్.. పోచర్ ట్రైలర్ చూశారా?

Hari Prasad S HT Telugu
Feb 15, 2024 08:50 PM IST

Poacher Web Series trailer: మరో క్రైమ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఉన్న పోచర్ సిరీస్ ట్రైలర్ గురువారం (ఫిబ్రవరి 15) రిలీజ్ కాగా.. ఈ సిరీస ఫిబ్రవరి 23 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి వస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్ పోచర్ లో దిబ్యేందు భట్టాచార్య
ఓటీటీలోకి వస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్ పోచర్ లో దిబ్యేందు భట్టాచార్య

Poacher Web Series trailer: వెబ్ సిరీస్‌లలో క్రైమ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జానర్ లో వచ్చిన సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నవే. ఇప్పుడు అలాంటిదే మరో క్రైమ్ సిరీస్ పోచర్ (Poacher Web Series) ఓటీటీలోకి రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో కోటి కోట్ల విలువైన స్కామ్ ఏనుగుల వేటకు సంబంధించి ఈ సిరీస్ లో చూపించబోతున్నాడు.

పోచర్ వెబ్ సిరీస్ ట్రైలర్

బాలీవుడ్ నటి ఆలియా భట్ సహ నిర్మాతగా ఈ పోచర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రిచీ మెహతా డైరెక్షన్ లో వస్తున్న సిరీస్ కావడంతో ఈ పోచర్ పై ఆసక్తి నెలకొంది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట రాకెట్ చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. గురువారం (ఫిబ్రవరి 15) ఈ ట్రైలర్ ను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

"ఇండియాలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇదీ ఒకటి" అనే క్యాప్షన్ తో ఆలియా ఈ ట్రైలర్ షేర్ చేసింది. కేరళ అడవుల్లో ఓ ఏనుగును ఓ ముఠా మట్టుబెట్టే సీన్ తో ట్రైలర్ మొదలువుతుంది. 1990ల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ ఏనుగులను వేటాడే ముఠా మళ్లీ యాక్టివ్ అయిందంటూ ఈ రాకెట్ ను ఇన్వెస్టిగేట్ చేసే టీమ్ మాట్లాడుకుంటూ ఉంటుంది.

అసలు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద క్రైమ్ రాకెట్ లేదు అన్నట్లుగా మేకర్స్ ఈ ఏనుగుల వేట ఎంత పెద్ద రాకెటో చెప్పే ప్రయత్నం చేసింది. దీని విలువ ఏకంగా రూ.కోటి కోట్లని ట్రైలర్ చివర్లో చెప్పడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. పోచర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా వెల్లడించారు.

పోచర్ వెబ్ సిరీస్

ఈ పోచర్ వెబ్ సిరీస్ కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆలియా.. దీనిని బాగా ప్రమోట్ చేస్తోంది. ఈ మధ్యే తాను అడవిలో ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ అడవిలో ఏనుగులను చంపుతున్న తీరుపై ఆ వీడియోలో ఆలియా మాట్లాడింది. అక్కడ కనిపించిన ఓ రైఫిల్, బుల్లెట్ కేసింగ్స్, ఓ ఏనుగు కళేబరం ఆలియాను భయపెడతాయి.

ఏనుగుల వేట ఎంత పెద్ద రాకెటో చెప్పే ప్రయత్నంలో భాగంగా తాను ఒక రోజు ఆ అడవిలో గడిపానని, కానీ ఆ సమయంలోనే అక్కడి దారుణాలు చూసి తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె చెప్పడం గమనార్హం. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పోచర్ సిరీస్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వస్తున్న మరో క్రైమ్ వెబ్ సిరీస్ ఇది.

Whats_app_banner