Panchayat Season 3 OTT Release date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్-panchayat season 3 ott release date super hit comedy drama web series to stream from tomorrow may 28th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Panchayat Season 3 Ott Release Date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్

Panchayat Season 3 OTT Release date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu
May 27, 2024 09:25 AM IST

Panchayat Season 3 OTT Release date: సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3 మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సీజన్ కోసం రెండేళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్

Panchayat Season 3 OTT Release date: ఇండియన్ ఓటీటీల్లో వచ్చిన అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటి పంచాయత్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదేళ్ల కిందట తొలిసారి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడీ సూపర్ హిట్ కామెడీ డ్రామా మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మరికొన్ని గంటల్లోనే వచ్చేస్తోంది.

పంచాయత్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్

పంచాయత్ సీజన్ 3 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం (మే 28) నుంచే ఈ కొత్త సీజన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ నెల మొదట్లో కొత్త సీజన్ తేదీని ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కామెడీ, డ్రామా, ఎమోషన్స్ ఇలా అన్నీ కలగలిపిన పంచాయత్ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరినీ అలరించింది.

కొన్ని రోజుల కిందట ఈ కొత్త సీజన్ ట్రైలర్ ను కూడా ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ కొత్త సీజన్లో ఫులేరా రాజకీయాలకు దూరంగా ఉండటానికి అభిషేక్ చేసే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక మూడో సీజన్లో ఫులేరా పంచాయతీకి ఎన్నికలు జరగబోతున్నట్లు, అందులో ప్రస్తుత ప్రధాన్ మంజు దేవి (నీనా గుప్తా)కు గట్టి ప్రత్యర్థి తగులుకున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇక ప్రధాన్ కూతురు రింకీతో అభిషేక్ బంధం ఈ సీజన్లో మరింత బలపడినట్లు కూడా చూపించారు.

ఓవరాల్ గా ట్రైలర్ తోనే మూడో సీజన్ పై అంచనాలను భారీగా పెంచేశారు. తొలి రెండు సీజన్లలాగే మూడో సీజన్ కూడా అలరిస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండో సీజన్లో నవ్వులతోపాటు చివర్లో కాస్త భావోద్వేగాలను కూడా జోడించిన మేకర్స్.. ఈ కొత్త సీజన్లో ఏం చేయబోతున్నారో చూడాలి.

పంచాయత్ సీజన్ 4 ఉంటుందా?

పంచాయత్ మూడో సీజన్ రిలీజ్ కు ముందు ఈ వెబ్ సిరీస్ లో అభిషేక్ త్రిపాఠీ అనే పంచాయత్ సచివ్ పాత్ర పోషించిన జితేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్ నాలుగో సీజన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు హింట్ ఇచ్చాడు. ప్రత్యేకమైన స్టోరీతో ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించిందని, ఇలాంటి నెరేటివ్ తో ఈ మధ్య కాలంలో ఏ వెబ్ సిరీస్ రాలేదని చెప్పాడు.

ఫులేరా అనే ఊరు.. అక్కడ పంచాయత్ సెక్రటరీగా ఉద్యోగం చేయడానికి వచ్చిన ఓ యువకుడు.. ఆ ఊళ్లోని రాజకీయాలు, ప్రజల మధ్య సంబంధాలు, ఇష్టం లేకుండానే అక్కడి వాళ్లతో ఆ యువకుడు బంధాలను పెంచుకున్న తీరు.. ఇలా మొత్తం ఆ ఊరి చుట్టే తిరుగుతూ నవ్వించే సిరీసే ఈ పంచాయత్. ఇప్పటి వరకూ ఈ సిరీస్ చూసి ఉండకపోతే మూడో సీజన్ ప్రారంభమయ్యే లోపే మొదటి రెండు సీజన్లు చూసేయండి.

తొలి రెండు సీజన్లు కూడా ప్రైమ్ వీడియోలోనే అందుబాటులో ఉన్నాయి. మూడో సీజన్ మంగళవారం (మే 28) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

టీ20 వరల్డ్ కప్ 2024