OTT Thriller Movie: మరో ఓటీటీలోనూ తెలుగులో అందుబాటులోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ మూవీ
OTT Thriller Movie: ఓ మలయాళ హిట్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులో రెండో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలన్న విషయాలు తెలుసుకోండి.
OTT Thriller Movie: మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్ రెండు రోజుల వ్యవధిలో రెండో ఓటీటీలోకి కూడా తెలుగులో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఈ మధ్యే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమలా పాల్ నటించిన ఈ సినిమా.. ఆహా వీడియో ఓటీటీలోకి కూడా వచ్చింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ వెల్లడించింది.
ఆహా వీడియో ఓటీటీలోకి లెవల్ క్రాస్
మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్. జులై 26న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆదివారం (అక్టోబర్ 13) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మంగళవారం (అక్టోబర్ 15) నుంచి ఈ మూవీ ఆహా వీడియోలోకి కూడా అడుగుపెట్టింది.
"అనుకోని ప్రేమ. బద్ధలైన నమ్మకం. శాశ్వతమైన పరిణామాలు.. లెవల్ క్రాస్ మూవీ ఆహా వీడియోలో చూడండి" అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది. మలయాళ నటుడు ఆసిఫ్ అలీ, అమలా పాల్ జంటగా ఈ మూవీ వచ్చింది. అర్బాజ్ అయూబ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఆసిఫ్ అలీ నటించిన తలవన్, అడియోస్ అమిగో మూవీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడీ థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్ కూడా వచ్చేస్తోంది.
ఏంటీ లెవల్ క్రాస్ మూవీ?
లెవల్ క్రాస్ మూవీ రఘు అనే ఓ రైల్వే గేట్ కీపర్, అతని జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఏళ్ల పాటు అదే గేటు దగ్గర ఒంటరిగా గడిపిన రఘుకి ఓ రైల్లో నుంచి దిగిన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి మనసులు కలుస్తాయి.
అయితే చైతాలీ(అమలా పాల్) అనే ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లవడం, ఆమె భర్త వీళ్ల జీవితాల్లోకి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఊహించని ట్విస్టులతోపాటు భయపెట్టే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ లెవల్ క్రాస్ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ లెవల్ క్రాస్ మూవీ బాగా నచ్చుతుంది. సినిమాలోని ట్విస్టులు మంచి థ్రిల్ ను పంచుతాయి. డైరెక్టర్ అర్ఫాజ్ ఆయుబ్ ఈ మూవీని ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా మలిచిన తీరు మూవీలో కనిపిస్తుంది.
థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడీ సినిమాను ప్రైమ్ వీడియోతోపాటు ఆహా వీడియోలోనూ చూసే అవకాశం దక్కనుంది. మలయాళంతోపాటు మరో నాలుగు భాషల్లోనూ లెవల్ క్రాస్ మూవీ రానుండటంతో ఆయా భాషల ప్రేక్షకులు ఈ సినిమాను హాయిగా చూసేయొచ్చు.