Nushrratt on Dating rumour: హనీ సింగ్‌తో డేటింగ్‌పై నుష్రత్ స్పందన.. నాకు కూడా ఒక..!
Nushrratt on Dating rumour: బాలీవుడ్ సెలబ్రెటీలు హనీ సింగ్-నుష్రత్ భరుచా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సదరు హీరోయిన్ నుష్రత్ స్పందించింది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
Nushrratt on Dating rumour: బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల పాటు డేటింగ్ చేసిన సెలబ్రెటీలు తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నాయి. రణ్‌బీర్-ఆలియా, విక్కీ-కత్రీనా, సిద్ధార్థ్-కియారా తదితరులు తమ బంధాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ మధ్య కాలంలో మరొ కొత్త జంట ప్రేమలో మునిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వారే ప్రముఖ హిందీ సింగర్ హనీ సింగర్, హీరోయిన్ నుష్రత్ భరుచా. వీరిద్దరూ ఇటీవలే ఓ ఈవెంట్‌కు కలిసి హాజరుకావడమే కాకుండా.. వెళ్లేటప్పుడు కూడా సన్నిహితంగా మెలిగారు. హనీ సింగ్.. నుష్రత్ చేయిని పట్టుకుని మరీ క్రౌడ్ నుంచి బయటకు తీసుకెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ ఊహాగానాలపై నుష్రత్ స్పందించింది. హనీ సింగ్‌తో డేటింగ్ గురించి తెలియజేశారు. "ఇది నా కెరీర్‌లో వచ్చిన మొదటి డేటింగ్ రూమర్. నేను ఎక్కడికి వెళ్లినా ఇంత వరకు నాపై ఇలాంటి పుకార్లు రాలేదు. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవ్వరితోనూ రిలేషన్‌లో లేను. కానీ ఇప్పుడు ఈ వార్త తెలిసినప్పుడు.. వావ్ నాపై కూడా ఓ డేటింగ్ రూమర్ వచ్చిందనిపించింది. ఇప్పుడు ప్రజలు ర్యాపిడ్ ఫైర్‌లో నాకు ఈ ప్రశ్న వేస్తారు. అప్పుడు నాక్కూడా ఓ డేటింగ్ రూమర్ ఉందని చెబుతాను. ఇలా రాసేవారికి బహుశా ఎలాంటి పని లేదనుకుంటా. వారికి గొప్ప ఇమాజినేషన్ ఉంది. కాబట్టి చేయనివ్వండి.. నాకు ఎలాంటి సమస్య లేదు" అని నుష్రత్ బదులిచ్చింది.
ఛత్రపతికి రీమేక్‌గా హిందీలో అదే పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా వస్తోంది. ఈ మూవీలో నుష్రత్ హీరోయిన్ చేసింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా నుష్రత్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
"ఛత్రపతి గురించి చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాను. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా యాక్షన్ డ్రామా. ఇంతకంటే మెరుగైన సినిమా కావాలని నేను కోరుకోను. ఛత్రపతి టీమ్‌తో పనిచేయడం చాలా బాగుంది. ఎంతో ప్రతిభావంతులైన టెక్నిషియన్స్‌తో పనిచేశారు. కో స్టార్ బెల్లంకొండ శ్రీనివాస్ అమెజింగ్ పర్సన్." అని నుష్రత్ బదులిచ్చింది.
ఈ హిందీ ఛత్రపతిని బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నుష్రత్ హీరోయిన్‌గా చేయగా.. వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. శరత్ కేల్కర్, భాగ్యశ్రీ, అమిత్ నాయర్, సాహిల్ వైద్, శివమ్ పాటిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2005లో రాజమౌలి-ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఛత్రపతి మూవీకి రీమేక్‌గా ఇది రానుంది. మే12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
టాపిక్