No Entry Trailer: కుక్కలు అంటించే వైరస్.. థ్రిల్లింగా నో ఎంట్రీ మూవీ ట్రైలర్-no entry trailer out as the movie promises high action drama ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  No Entry Trailer: కుక్కలు అంటించే వైరస్.. థ్రిల్లింగా నో ఎంట్రీ మూవీ ట్రైలర్

No Entry Trailer: కుక్కలు అంటించే వైరస్.. థ్రిల్లింగా నో ఎంట్రీ మూవీ ట్రైలర్

Hari Prasad S HT Telugu
Feb 20, 2023 05:36 PM IST

No Entry Trailer: కుక్కలు అంటించే వైరస్ అంటూ సరికొత్త స్టోరీతో థ్రిల్లింగా వచ్చేసింది నో ఎంట్రీ మూవీ ట్రైలర్. సోమవారం (ఫిబ్రవరి 20) ఈ ట్రైలర్ రిలీజైంది.

నో ఎంట్రీ మూవీలో ఆండ్రియా
నో ఎంట్రీ మూవీలో ఆండ్రియా

No Entry Trailer: ఆండ్రియా జెరెమియా.. తమిళ ఇండస్ట్రీలో మంచి పేరున్న నటి. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుందనే పేరుంది. తాజాగా ఆమె లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా పేరు నో ఎంట్రీ. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 20) ఈ నో ఎంట్రీ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అలగుకార్తీక్ ఈ మూవీ డైరెక్ట్ చేశాడు. ఈ హై యాక్షన్ డ్రామా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లోని కుక్కలకు ఉన్న బలాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన మందు ఓ కొత్త వైరస్ కు కారణం కావడం, ఆ వైరస్ ను కుక్కలు మనుషులకు అంటించడానికి చేసే ప్రయత్నం, వాటి నుంచి బయటపడటానికి ఈ మూవీలో ఫిమిల్ లీడ్, ఆమె టీమ్ పడే పాట్లతో ట్రైలర్ ఇంట్రెస్టింగా ఉంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ నో ఎంట్రీపై అంచనాలు పెంచగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కుక్కల్లోకి ఇంజెక్ట్ చేసిన ఆ మందును కనిపెట్టిన తన తండ్రిని వెతుక్కుంటూ ఇండోపాక్ బోర్డర్ కు వెళ్లే హీరోయిన్.. అక్కడ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

ఈ నో ఎంట్రీ మూవీలో ఆండ్రియాతోపాటు అధవ్ కన్నదాసన్, రన్యా రావు, మానస్, జయశ్రీ, జాన్వీ నటించారు. అలగుకార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీధర్ అరుణాచలం జంబో సినిమాస్ బ్యానర్ కింద నిర్మించారు. అజేష్ మ్యూజిక్ అందించాడు.

Whats_app_banner