Nivetha Thomas: ఇంత లావు ఉన్నావేంటి - నివేథా థామస్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Nivetha Thomas: నివేథా థామస్,రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన శాకిని డాకిని సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు తన సోదరుడితో కలిసి డ్యాన్స్ చేసిన రీల్ వీడియోను నివేథా థామస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నివేథా లుక్,వెయిట్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Nivetha Thomas: వకీల్ సాబ్ అనంతరం దాదాపు ఏడాది విరామం తర్వాత శాకిని డాకిని సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది నివేథా థామస్. కొరియన్ చిత్రం మిడ్నైట్ రన్నర్స్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో నివేథా థామస్‌తో పాటు రెజీనా మరో హీరోయిన్గా కనిపించబోతున్నది. సెప్టెంబర్ 16న ఈ సినిమా రిలీజ్‌కానుంది.
శాకిని డాకిని టైటిల్ సాంగ్‌కు సోదరుడు నిఖిల్ థామస్‌తో కలిసి డ్యాన్స్ చేసిన రీల్ వీడియోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో నివేథా థామస్ వైట్ షర్ట్, జీన్స్ ధరించి కనిపించింది. ఈ డ్రెస్‌లో నివేథా థామస్ చాలా లావుగా కనిపించడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంత లావున్నావేంటి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా అయిపోయావు ఎంటి నివేథా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. చాలా లావయ్యావు చూసుకో అంటూ చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆమె బరువు గురించి నెటిజన్లు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యాక్షన్ ఎంటర్టైనర్
యాక్షన్ ఎంటర్టైనర్గా శాకిని డాకిని సినిమా రూపొందుతోంది. పోలీస్ శిక్షణలో ఉన్న ఇద్దరు యువతులు హ్యుమన్ ట్రాఫికింగ్ క్రైమ్‌ను ఎలా అడ్డుకున్నారనే పాయింట్‌తో దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను రూపొందించారు. వకీల్ సాబ్ తర్వాత దాదాపు ఏడాది విరామం అనంతరం నివేథా థామస్ నటించిన సినిమా ఇది.
రెజీనా కూడా లాంగ్ గ్యాప్ తర్వాత శాకిని డాకినితో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇటీవల విడుదలైన చిరంజీవి ఆచార్యలో ఐటెంసాంగ్‌లో రెజీనా కనిపించింది. శాకిని డాకిని సినిమాను సురేష్‌బాబుతో కలిసి సునీత తాటి నిర్మించింది.