Nithiin |నెల రోజులు ఆల‌స్యంగా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం-కొత్త రిలీజ్ డేట్ ఇదే-nithiin macherla niyojakavargam new release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nithiin |నెల రోజులు ఆల‌స్యంగా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం-కొత్త రిలీజ్ డేట్ ఇదే

Nithiin |నెల రోజులు ఆల‌స్యంగా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం-కొత్త రిలీజ్ డేట్ ఇదే

HT Telugu Desk HT Telugu
May 09, 2022 06:35 AM IST

తనఅభిమానులకునితిన్గుడ్న్యూస్వినిపించారు.మాచర్లనియోజకవర్గంసినిమారిలీజ్డేట్నువెల్లడించారు.పొలిటికల్బ్యాక్డ్రాప్లోరూపొందుతున్నఈసినిమాఎప్పుడూరిలీజ్కానుందోతెలుసా...

<p>నితిన్&nbsp;</p>
నితిన్ (twitter)

కెరీర్‌లో తొలిసారి పొలిటికల్ కథాంశంతో హీరో నితిన్ చేస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం.ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ గా నితిన్ కనిపించబోతున్నారు. 

తొలుత ఈ సినిమాను జూలై 8న విడుదలచేయాలని అనుకున్నారు. షూటింగ్ తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాల విషయంలో జాప్యం చోటు చేసుకోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కొత్త రిలీజ్ డేట్ ను వెల్లడించింది. ఆగస్ట్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నితిన్ కొత్త పోస్టర్ ను విడుదలచేశారు. ఇందులో పొడవైన మీసకట్టుతో మాస్ లుక్ లో నితిన్ కనిపిస్తున్నారు. 

ప్రస్తుతం ఇటలీ, ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్స్ లో పాటలను చిత్రీకరిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టితో కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్ ను విడుదలచేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం