NNS 29th July Episode: అరుంధతి అస్థికలను ఘోరాకు ఇచ్చిన మనోహరి.. ప్రిన్సిపాల్‍ నుంచి అంజలిని కాపాడిన మిస్సమ్మ-nindu noorella saavasam july 29th episode manohari give arudhati ashes to ghora and missama save anjali from principle ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 29th July Episode: అరుంధతి అస్థికలను ఘోరాకు ఇచ్చిన మనోహరి.. ప్రిన్సిపాల్‍ నుంచి అంజలిని కాపాడిన మిస్సమ్మ

NNS 29th July Episode: అరుంధతి అస్థికలను ఘోరాకు ఇచ్చిన మనోహరి.. ప్రిన్సిపాల్‍ నుంచి అంజలిని కాపాడిన మిస్సమ్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 29, 2024 07:32 AM IST

Nindu Noorella Saavasam 29th July Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్‍లో అరుంధతి అస్థికలను నేటి (జూలై 29) ఎపిసోడ్‍లో దక్కించుకుంటుంది మనోహరి. మరోవైపు ప్రిన్సిపాల్ నుంచి అంజలిని కాపాడుతుంది మిస్సమ్మ. నేటి ఎపిసోడ్‍లో ఏం జరగనుందో ఇక్కడ తెలుసుకోండి.

NNS 29th July Episode: అంజలిని కాపాడిన మిస్సమ్మ.. అరుంధతి అస్థికలను ఘోరాకు ఇచ్చిన మనోహరి
NNS 29th July Episode: అంజలిని కాపాడిన మిస్సమ్మ.. అరుంధతి అస్థికలను ఘోరాకు ఇచ్చిన మనోహరి

జీ తెలుగు సీరియల్‍ ‘నిండు నూరేళ్ల సావాసం’ ఆసక్తికరంగా సాగుతోంది. నేటి (జూలై 29) ఎపిసోడ్‍లో అమర్​కి నచ్చజెప్పి పిల్లలను తానే స్కూల్లో దింపుతానంటుంది మిస్సమ్మ (భాగీ). సరేనంటాడు అమర్​. ప్రిన్సిపాల్‍తో మాట్లాడి అంజలిని రక్షించాలని మిస్సమ్మ గట్టిగా నిర్ణయించుకుంది.

ప్రిన్సిపాల్‍కు వార్నింగ్

పిల్లలను తీసుకుని స్కూల్​కి వెళ్తుంది మిస్సమ్మ. ప్రిన్సిపల్​ కావాలనే అంజలిపై రివేంజ్​ తీసుకోవడానికే అన్నీ కల్పించి చెబుతుందని తెలుసుకుని గట్టిగా వార్నింగ్​ ఇస్తుంది. ఇకపై పిల్లల విషయంలో ఇలా ప్రవర్తిస్తే ఊరుకోనని, వాళ్లని చూసుకోడానికి ఎప్పటికీ ఈ మిస్సమ్మ ఉంటుందని చెప్పి బయల్దేరుతుంది. “మీరు ఇంతగా చెప్పిన తర్వాత మళ్లీ అలా ఎందుకు చేస్తాను మేడమ్​.. ఏదేమైనా చేయను” అని అంటుంది ప్రిన్సిపల్. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతుంది మిస్సమ్మ. “చూడండి ప్రిన్సిపల్​గారూ.. ఇదివరకు ఉన్న అమ్మ తన తప్పు లేకపోయినా గొడవెందుకని సారీ చెబుతుండేది. కానీ ఈ అమ్మ అలా కాదు తప్పు లేకపోతే తాట తీస్తుంది” అంటాడు రాథోడ్​.

అస్థికల వద్దకు మనోహరి - మిస్సమ్మ రాకతో టెన్షన్

అరుంధతి అస్థికల కోసం స్మారకభవనంలోని లాకర్​ డోర్​ ఓపెన్​ చేయడానికి ప్రయత్నిస్తుంది మనోహరి. అప్పుడే రాథోడ్, మిస్సమ్మ అక్కడికి రావడం చూసి మనోహరికి ఫోన్​ చేసి చెబుతాడు ఘోరా. వాళ్లు ఇప్పుడెందుకు వచ్చారు అని కంగారు పడుతుంది మనోహరి. మిస్సమ్మ రిజిస్టర్​లో సంతకం పెట్టి లాకర్​ కీ తీసుకుని లోపలకు వెళ్తుంది. వాళ్లని చూసి దాక్కుంటుంది మనోహరి. మనోహరిని మిస్సమ్మకు పట్టిద్దామనుకుంటుంది అరుంధతి. కానీ రాథోడ్​ ముందు మిస్సమ్మతో మాట్లాడితే తను ఆత్మ అని తెలిసిపోతుందని కంగారుగా దాక్కుంటుంది అరుంధతి. తాను తెచ్చిన ఫేక్​ అస్థికల్ని మర్చిపోయిన మనోహరి వాటిని తీసుకుని దాక్కుంటుంది. మిస్సమ్మ లోపలకు వచ్చి లాకర్లో ఉన్న అస్థికలు భద్రంగా ఉన్నాయా అని చూస్తుంది. వాటిని చేతిలోకి తీసుకుని చాలా బాధపడుతుంది. మనోహరి గురించి మిస్సమ్మకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది అరుంధతి.

“మనోహరి ఈ అస్థికల గురించి ఎందుకు అడిగిందో మనం కనిపెట్టాలి రాథోడ్​. కచ్చితంగా అదేదో ప్లాన్ చేసి ఉంటుంది” అని అంటుంది మిస్సమ్మ. అలాగే మిస్సమ్మ అంటాడు రాథోడ్​. మళ్లీ అస్థికల్ని భద్రంగా లోపల పెట్టి లాక్​ చేసిన మిస్సమ్మ మనోహరి వచ్చి ఉంటుందంటావా అంటుంది. కనుక్కుందాం పదా.. అని బయటకు వెళ్లి గార్డ్​ని అడుగుతుంది. ఎవరూ రాలేదని చెప్పడంతో ఎవరు వచ్చినా అక్కడ రాసిన నెంబర్​కి కాల్​ చేసి చెప్పమని చెప్పి వెళ్లిపోతారు మిస్సమ్మ, రాథోడ్​.

మనోహరి చేతికి అస్థికలు.. ఘోరాకు అప్పగింత

అరుంధతి అస్థికల్ని తీసుకుని వాటి స్థానంలో నకిలి అస్థికల్ని పెట్టి బయటకు వస్తుంది మనోహరి. గార్డ్​ కంటపడకుండా బయటకు వచ్చి తెచ్చిన అస్థికల్ని ఘోరాకి ఇస్తుంది. వాళ్లనుంచి ఎలా తప్పించుకున్నావని అడుగుతాడు ఘోరా. మేనేజ్​ చేశానంటుంది మనోహరి. అస్థికల్ని తీసుకుని గట్టిగా నవ్వుతాడు ఘోరా. భయపడుతుంది అరుంధతి.

“ఈ అస్థికల్ని ఉపయోగించి నేను ఆ ఆత్మని బంధించబోతున్నా.. ఆత్మా.. నీ అలుపెరుగని ప్రయాణానికి రేపటితో ముగింపు పలకబోతున్నా” అని అంటాడు ఘోరా. మరి నా పనెప్పుడు చేస్తావని అడుగుతుంది మనోహరి. “నాకు శక్తులు వచ్చిన వెంటనే నీ పనులన్ని ఒకేసారి చేసేస్తాను. ఆ అమరేంద్రనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేలా, ఆ భాగమతిని అతనే బయటకు పంపేలా చేస్తా” అని అంటాడు ఘోరా. మరి నా మెంటల్ మొగుడు సంగతేంటి? అంటుంది మనోహరి. వాడి చావుతోనే నీ గెలుపు ప్రారంభమవుతుంది అంటాడు ఘోరా. సరే ఘోరా.. రేపటి నా విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటానంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తనను ఆ ఘోరా, మనోహరి నుంచి తన కుటుంబాన్ని కాపాడమని దేవుణ్ని వేడుకుంటుంది అరుంధతి.

బాధపడిన అరుంధతి​

పిల్లల అల్లరితో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ఇల్లు మనోహరి రాకతో నరకంలా మారిపోయిందని బాధపడుతుంది అరుంధతి. అప్పుడే అమర్​ వచ్చి కిటికీ దగ్గర నిల్చోవడంతో.. “ఏవండీ.. మీరందరూ నా కళ్లముందు ఉన్నారనే సంతోషం కూడా లేకుండా పోయింది. ఆ ఘోరా నన్ను ఏ క్షణానైనా బంధించవచ్చు. అర్థంలేకుండా వచ్చిన పుట్టుక, అర్ధాంతరగా వచ్చిన చావు తప్ప నాకు మిగిలిందేంటంటే మీ పరిచయం, మన పిల్లలు.. నాకు మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు” అని ఏడుస్తుంది అరుంధతి. ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్న అమర్​కి అరుంధతి డైరీ కనిపిస్తుంది. అమర్​ డైరీ చదువుతాడా? మనోహరి గురించి అమర్​కి తెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే నేడు జూలై 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ చూడాలి.

Whats_app_banner