Nindu Noorella Saavasam 27th November Episode: అమ‌ర్ ఇన్వేస్టిగేష‌న్ - మ‌నోహ‌రి భ‌యం - రామ్మూర్తి ఖుషి-nindu noorella saavasam 27th november episode manohari fears on amar investigation ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nindu Noorella Saavasam 27th November Episode: అమ‌ర్ ఇన్వేస్టిగేష‌న్ - మ‌నోహ‌రి భ‌యం - రామ్మూర్తి ఖుషి

Nindu Noorella Saavasam 27th November Episode: అమ‌ర్ ఇన్వేస్టిగేష‌న్ - మ‌నోహ‌రి భ‌యం - రామ్మూర్తి ఖుషి

Nelki Naresh Kumar HT Telugu
Nov 27, 2023 01:33 PM IST

Nindu Noorella Saavasam 27th November Episode: అరుంధ‌తి మ‌ర్డ‌ర్ కేసును ప‌ర్స‌న‌ల్‌గా ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు అమ‌ర్‌. తానే యాక్సిడెంట్ చేయించిన విష‌యం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందో అని మనోహరి భ‌యప‌డుతుంది. ఆ త‌ర్వాత నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియ‌ల్‌

Nindu Noorella Saavasam 27th November Episode: ఇంటికి వచ్చిన అమర్​ సీరియస్ గా ఉంటాడు. అది చూసిన‌ అరుంధతి మా ఆయన ఎందుకలా ఉన్నారు అని చిత్రగుప్తుడిని అడుగుతుంది. అతని ఏమీ మాట్లాడకపోవటంతో నేనే కనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలిక నీవు కట్టుకున్న అబద్ధాల మేడ పునాదులు కూలిపోవు సమయం ఆసన్నమైంది అనుకుంటాడు. అమర్ రావడం చూసి వేడివేడిగా కాఫీ పెట్టుకుని వెళ్లి ఇస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటూ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది మనోహరి.

రాథోడ్‌పై ఫైర్‌...

తన గదిలోకి వెళ్లిన అమరేంద్ర సీరియస్ గా రాథోడ్ ని పిలుస్తాడు. లోపలికి వచ్చిన రాథోడ్​ని నేను చెప్పిన సంగతి ఏం చేశావు అని అడుగుతాడు అమర్​​. అన్ని వివరాలు తెలుసుకుంటున్నాను సార్, అయినా మీరు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నా మనసు కి చాలా బాధగా ఉంది అంటాడు రాథోడ్​.

అరుంధ‌తి క‌న్ఫ్యూజ్‌...

వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అరుంధ‌తి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంట్లో వాళ్లకి ఏమైనా జరిగిందేమో అని కంగారు పడుతుంది. ఇది నా అనుమానం మాత్రమే, ఆ లారీ నెంబర్ ప్లేటు, రిజిస్ట్రేషన్ రెండూ ఫేకే. అలా ఎవరు చేయించారో తెలిస్తే మాత్రం వాళ్లని విడిచి పెట్టేది లేదు అంటాడు అమర్​. అప్పుడే అక్కడికి కాఫీ తీసుకువచ్చిన మనోహర్ ఎవరిని విడిచి పెట్టకూడదు అంటున్నావు అని అడుగుతుంది.

భ‌యంతో వ‌ణికిపోయిన మ‌నోహ‌రి...

రాథోడ్ ని తలుపు వేసేయమని చెప్పి అరుంధతి యాక్సిడెంట్ విషయం చెప్తాడు. ఆ మాటలకి భయంతో వణికి పోయి చేతిలోని కాఫీ కప్​ వదిలేస్తుంది. అరుంధతి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. భయంతో వణుకుతూనే ఏం మాట్లాడుతున్నావ్ అమర్ అని అంటుంది మనోహరి.

ప‌ర్స‌న‌ల్ ఇన్వేస్టిగేష‌న్‌...

లారీ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ రెండు ఫేక్, యాక్సిడెంట్​ జరగడానికి వారం రోజులు ముందు నుంచి జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అనుమానంగా ఉంది అందుకే నేను పర్సన‌ల్‌గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అంటూనే భయంతో వణికిపోతున్న మనోహరిని చూసి నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావు అని అడుగుతాడు అమర్​.

అలాంటిదేమీ లేదు నువ్వు చెప్పిన మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అయినా అరుంధతిని ఎవరు చంపాలి అనుకుంటారు నేను కొడైకెనాల్ వెళ్లి తెలుసుకుంటాను అంటుంది మనోహరి. వద్దు, ఇప్పటివరకు నిజం బయటపడలేదని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు వాళ్ళని అలాగే ఉండని...ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పకు అంటాడు అమర్. ఇక అక్కడ ఉండలేక కాఫీ కప్ క్లీన్ చేయించడానికి నీలని పంపిస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

అమ‌ర్ అనుమానం...

బయటికి వచ్చిన తర్వాత అమర్ లో అనుమానం మొదలైంది, ఆ హత్య చేయించింది నేనే అని తెలిస్తే అమర్ నన్ను వదిలిపెట్టడు అంటూ భయంతో వణికిపోతూ ఉంటుంది మనోహరి. ఆనందంగా ఇంటికి వచ్చిన భర్తని ఏంటి అంతా ఆనందంగా ఉన్నావు అని అడుగుతుంది మంగళ. రేపు మనవళ్ల‌ ఇంటికి వెళ్ళబోతున్నాను అని నోరు జారుతాడు రామ్మూర్తి.

మంగళ ఆమె తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు అంటూ నిలదీసేసరికి మాట మార్చేసి పొద్దున్న బండిమీద మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. కంగారుపడుతూ ఏదో పనిమీద వెళుతున్నాము అన్నీ నీకు చెప్పాలా ఏంటి అని తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మంగళ.

రామ్మూర్తి ఆనందం...

అప్పుడే అక్కడికి వచ్చిన భాగమతి తండ్రిని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత మీరు ఆనందంగా ఉన్నారు కారణమేంటి అని అడుగుతుంది. కొందరి పరిచయం నన్ను ఇలా చేసింది అంటాడు రామ్మూర్తి. మీకు ఇంత ఆనందాన్నిచ్చినా వాళ్ళని నాకు కూడా పరిచయం చేయండి అని అడుగుతుంది భాగమతి. ఈ పరిచయం చేయలేను చేస్తే నేను వాచ్‌మెన్‌గా చేసిన సంగతి నీకు తెలిసిపోతుంది అనుకుంటాడు ఆమె తండ్రి.

వార్డెన్ సంగతి ఏమైనా తెలిసిందా అని తండ్రిని అడుగుతుంది. లేదంటాడు రామ్మూర్తి. అక్క ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడు తనతో నేను గోరుముద్దలు తినిపించుకుంటాను అంటూ బాధ‌గా ఎమోషనల్ అవుతూ తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది భాగీ. అన్ని నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి ఏమీ బాధపడకు అని ధైర్యం చెప్తాడు ఆమె తండ్రి.

మిస్స‌మ్మ ఆల‌స్యం...

ఇంటికి లేటుగా వచ్చి అమరేంద్ర కి కనిపించకుండా ఉండటం కోసం నక్కినక్కి వెళ్తూ ఉంటుంది మిస్సమ్మ. కానీ అమరేంద్ర కంట్లో పడిపోతుంది. ఇంత లేటుగా ఇంటికి వచ్చావు ఇంకా నువ్వు పిల్లల్ని ఏం చూసుకుంటావు అని అడుగుతాడు అమర్. కొంచెం పని ఉండి వెళ్ళవలసి వచ్చింది కానీ అక్కడ లేట్అ యిపోయింది అంటుంది మిస్సమ్మ.

నీకు ఏం కావాలన్నా నన్ను నిరభ్యంతరంగా అడగవచ్చు నా పిల్లల బాధ్యత నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నీ బాధ్యత నేను చూస్తాను ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు అమర్. మిస్సమ్మ తన తండ్రి ఆరోగ్యం గురించి చెబుతుందా? రామ్మూర్తి అమర్​ ఇంటికి భోజనానికి వెళతాడా? అనే విషయాలు తెలియాలంటే సోమ‌వారం ప్ర‌సారం కానున్న నిండు నూరేళ్లసావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner