Ajay Devgan |హిందీ మన జాతీయ భాషనా? అసలు ఇండియాకు జాతీయ భాష ఉందా?-netizens fire against ajaydevgn commenting on hindi is the national language ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajay Devgan |హిందీ మన జాతీయ భాషనా? అసలు ఇండియాకు జాతీయ భాష ఉందా?

Ajay Devgan |హిందీ మన జాతీయ భాషనా? అసలు ఇండియాకు జాతీయ భాష ఉందా?

HT Telugu Desk HT Telugu
Apr 28, 2022 06:12 AM IST

హిందీ జాతీయ‌భాష అంటూ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దేశానికి అధికారిక భాష లేద‌ని అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ఆ వాస్త‌వాన్ని గ్ర‌హిస్తే బాగుంటుందంటూ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నెటిజ‌న్ల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతున్నారు.

<p>అజ‌య్‌దేవ్‌గ‌ణ్</p>
అజ‌య్‌దేవ్‌గ‌ణ్ (twitter)

కన్నడ హీరో కిచ్చా సుదీప్,బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ మధ్య మొదలైన ట్విట్టర్ వార్ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హిందీ జాతీయ భాష అంటూ అజ‌య్ దేవ్‌గ‌ణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను చాలామంది నెటిజ‌న్ల‌తో పాటు రాజ‌కీయ‌నాయ‌కులు తప్పుపడుతున్నారు. కిచ్చా సుదీప్ కు మద్దతునిస్తున్నారు. హిందీ జాతీయ భాష కాదంటూ ఇటీవలే కిచ్చా సుదీప్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘హిందీ జాతీయ భాష కాకపోతే నీ మాతృభాష కన్నడ సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి ఎందుకు రిలీజ్ చేస్తున్నావు. హిందీ జాతీయ భాషగా ఉండేది. ఉంటుంది. ఇక మీదట కూడా ఉంటుంది’ అంటూ సుదీప్ కామెంట్స్ పై అజ‌య్ దేవ్‌గ‌ణ్ స్పందించారు. అత‌డు చేసిన‌ ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇండియాకు అధికారిక భాషఅంటూ ప్ర‌త్యేకంగా ఏదీ లేద‌ని, రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో హిందీ ఒకటి మాత్రమేనంటూ నెటిజన్లు అజ‌య్ దేవ్‌గ‌ణ్‌కు చుర‌క‌లు అంటిస్తున్నారు. హిందీని భాషను అధికంగా ఉపయోగించినంత మాత్రనా అది జాతీయ భాష అయిపోదనిఅత‌డి ట్వీట్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. అధికారిక భాషలే తప్ప ప్రత్యేకంగా మ‌న‌కు జాతీయ భాష లేదని అజ‌య్‌దేవ్‌గ‌ణ్‌ జీకే నాలెడ్జ్ పెంచుకుంటే బాగుంటుందని ఫ‌న్నీగా రిప్లై ఇస్తున్నారు. మరికొందరు మాత్రం సౌత్ సినిమాల్ని హిందీలో డబ్ చేయకూడదని అన్నప్పుడు...హిందీ సినిమాల్ని కూడా ఇతర భాషల్లోకి డబ్ చేయడం అపేయాలని అజ‌య్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. కిచ్చా సుదీప్ కామెంట్స్ ను స‌మ‌ర్థిస్తూ అజయ్ దేవ్ గణ్ పై విమర్శలు చేస్తున్నారు.

నెటిజన్లు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా కొందరు అజయ్ దేవ్‌గ‌ణ్ ట్వీట్‌పై స్పందిస్తున్నారు. హిందీ ఇప్పుడు,ఎప్పటికీ మన జాతీయ భాష కాదు అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వైరుధ్యాలతో సంబంధం లేకుండా ప్రతి భాషను పౌరులందరూ గౌరవించుకోవాల‌ని ఆయన అన్నారు. హిందీని జాతీయ భాష అని చెబితే విన‌డానికి ఎవ‌రూ లేర‌ని,అజ‌య్‌దేవ్‌గ‌ణ్ అజ్ఞానంలో ఉన్నార‌ని సినీ న‌టి,మాజీ ఎంపీ ర‌మ్య అన్నారు. కిచ్చా సుదీప్‌,అజ‌య్‌ దేవ్‌గ‌ణ్ ట్వీట్ వార్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

అజ‌య్ ట్వీట్ కు కిచ్చా సుదీప్ కాస్త వ్యంగ్యంగానే బదులిచ్చారు. నేను చెప్పింది ఒకటైతే మీరు మరో రకంగా అర్థం చేసుకున్నారు. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడితే ఇలాంటి సమస్యలే వస్తాయి అంటూ కిచ్చా సుదీప్ అన్నాడు. త‌న‌లో నెల‌కొన్న అపోహ‌ల్ని తొల‌గించినందుకు ధ‌న్యావాదాలు...అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని అజయ్ దేవ్‌గ‌ణ్ కూడా సుదీప్ కు బదులిచ్చాడు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ఇద్దరూ హీరోలు ట్వీట్ చేసినా నెటిజన్లు మాత్రం దీనిని కొనసాగిస్తూనే ఉన్నారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం