Nayanthara: న‌య‌న్‌-విఘ్నేష్ పెళ్లి వీడియో త్వ‌ర‌లో స్ట్రీమింగ్‌...అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది...-nayanthara vignesh shivan wedding documentary to stream soon on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara: న‌య‌న్‌-విఘ్నేష్ పెళ్లి వీడియో త్వ‌ర‌లో స్ట్రీమింగ్‌...అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది...

Nayanthara: న‌య‌న్‌-విఘ్నేష్ పెళ్లి వీడియో త్వ‌ర‌లో స్ట్రీమింగ్‌...అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది...

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 01:57 PM IST

ఈ ఏడాది జూన్ లో నయనతార, విఘ్నేష్ శివన్ ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వీడియో ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

<p>విఘ్నేష్ శివన్, నయనతార,</p>
విఘ్నేష్ శివన్, నయనతార, (twitter)

ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఈ ఏడాది జూన్ లో ఏడడుగులు వేసింది నయనతార. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. నయన్, విఘ్నేష్ పెళ్లి ఘట్టం తాలూకు వీడియో రైట్స్ ను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో కొనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు ఇరవై ఐదు కోట్లు వీరికి చెల్లించినట్లు సమాచారం. నయన్, విఘ్నేష్ పెళ్లికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్, ఏ.ఆర్ రెహమాన్ తో పాటు పలువురు దిగ్గజ ప్రముఖులు హాజరైన ఫొటోలను విఘ్నేష్ శివన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ తో ఉన్న ఒప్పందం మేరకు పెళ్లి వేడుక తాలూకు ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదు.

విఘ్నేష్ చేసిన పోస్ట్ కారణంగా నెట్ ఫ్లిక్స్ వారితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా నయన్ కు లీగల్ నోటీసులు పంపించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై నయన్, విఘ్నేష్ తో పాటు నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు స్పందించలేదు. తాజాగా అవన్నీ రూమర్స్ అంటూ నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చేసింది. గురువారం నయన్, విఘ్నేష్ పెళ్లి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో బీచ్ లో రొమాంటిక్ లుక్ లో నయన్, విఘ్నేష్ కనిపిస్తున్నారు. వీరి పెళ్లి వేడుక తాలూకు వీడియోను డాక్యుమెంటరీ రూపంలో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ పోస్ట్ నయన్, విఘ్నేష్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం