Nayanthara Becomes Mom: తల్లయిన నయనతార - సరోగసీ ద్వారా ట్విన్స్ జన్మించినట్లు వెల్లడి
Nayanthara Becomes Mom: నయనతార, విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులుగా మారారు. తమకు కవల పిల్లలు (ట్విన్ బాయ్స్) జన్మించినట్లు విఘ్నేష్ శివన్ ఆదివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నాడు. నయన్, విఘ్నేష్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
Nayanthara Becomes Mom: నయనతార తల్లిగా మారింది. సరోగసీ విధానం ద్వారా తమకు కవల పిల్లలు జన్మించినట్లు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. నయన్, విఘ్నేష్ శివన్ చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న ఫొటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
నయన్, తాను తల్లిదండ్రులు మారినట్లు పేర్కొన్నాడు. దేవుడితో పాటు పెద్దల అశీర్వాదాలు ఫలించి తమకు కవల పిల్లలు జన్మించినట్లు విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. పిల్లల రాకతో తమ జీవితం మరింత అందంగా మారినట్లు పేర్కొన్నాడు.
గాడ్ ఈజ్ డబుల్ గ్రేట్ అంటూ పేర్కొన్నాడు. విఘ్నేష్ శివన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి చేసుకున్నారు. తమ నాలుగేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలపైకి తీసుకొచ్చారు.