Nagarjuna: నాగార్జున ది ఘోస్ట్ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందా....
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది ఘోస్ట్. స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి టాలీవుడ్‌లో ఆసక్తిక వార్త వినిపిస్తోంది. అది ఏమిటంటే...
బంగార్రాజుతో సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగార్జున. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా కనిపించారు. సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా పర్వాలేదనిపించింది. బంగార్రాజు తర్వాత యాక్షన్ బాట పట్టారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేస్తున్నారు.
స్పై థ్రిల్లర్ కథాంశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి విదేశాల నుండి ఇండియాకు ఓ గూఢచారిగా నాగార్జున కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయి చాలా రోజులైంది. రిలీజ్ కు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ను మేకర్స్ ఇప్పటివరకు వెల్లడించడం లేదు. కాగా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో నిర్మాతలు భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఆ డీల్ కు కట్టుబడే ఓటీటీలో నేరుగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఓటీటీ రిలీజ్ పై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జుకు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలుత కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుండి అనూహ్యంగా ఆమె తప్పుకుంది. కాజల్ స్థానాన్ని సోనాల్ తో భర్తీ చేశారు.
సంబంధిత కథనం