KrishnammaTeaser: కృష్ణమ్మ టీజర్ వచ్చేసింది - తనను ఎవరూ గెలక్కూడదని సత్యదేవ్ వార్నింగ్
సత్యదేవ్ (Satya Dev) కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణమ్మ టీజర్ ను (KrishnammaTeaser) మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో సినిమాలు చేస్తూ హీరోగా టాలీవుడ్ లో ప్రతిభను చాటుకుంటున్నాడు సత్యదేవ్. అతడు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను గురువారం హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు.
ఓ వ్యక్తిని హతమార్చుతూ సత్యదేవ్ కనిపించే సీన్ తో టీజర్ మొదలైంది. ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు అంటూ సత్యదేవ్ వాయిస్ తో వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ గెలక్కూడదూ అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. యాక్షన్ అంశాలకు ప్రేమ, స్నేహాన్ని జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ముగ్గురు స్నేహితులు తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారన్నది పవర్ ఫుల్ గా ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.
కృష్ణమ్మ సినిమాతో మరోమారు ఇంటెన్స్ రోల్ లో సత్యదేవ్ కనిపిస్తున్నారు. కాలభైరవ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించారు. త్వరలో కృష్ణమ్మ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న గాఢ్ ఫాదర్ తో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
టాపిక్