Mathu Vadalara 2 Release Date: సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే-mathu vadalara 2 release date crime comedy movie sequel to release on 13th september ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2 Release Date: సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Mathu Vadalara 2 Release Date: సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Aug 26, 2024 05:34 PM IST

Mathu Vadalara 2 Release Date: సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ మత్తు వదలరా సీక్వెల్ వచ్చేస్తోంది. కొన్నాళ్ల కిందటే ఈ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా సోమవారం (ఆగస్ట్ 26) రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. వచ్చే నెలలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే
సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Mathu Vadalara 2 Release Date: తెలుగులో ఐదేళ్ల కిందట ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ మత్తు వదలరా. ఈ క్రైమ్ కామెడీ సినిమాకు సీక్వెల్ మత్తు వదలరా 2 ఇప్పుడు రాబోతోంది. రితేష్ రాణా డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే నెల 13న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు సోమవారం (ఆగస్ట్ 26) మేకర్స్ తెలిపారు.

మత్తు వదలరా 2 రిలీజ్ డేట్

మత్తు వదలరా మూవీ 2019లో రిలీజైన క్రైమ్ కామెడీ మూవీ. ఇందులో శ్రీసింహ, సత్య, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్ లో నటించారు. ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులను కట్టి పడేసింది.

దీంతో ఆ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 తీసుకొస్తున్నట్లు గతంలోనే చెప్పిన మేకర్స్.. కొన్ని నెలల షూటింగ్ తర్వాత సెప్టెంబర్ 13న మూవీని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అదే రోజు ధూమ్ ధామ్, ఉత్సవంలాంటి సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.

సీక్వెల్‌కూ అదే రెస్పాన్స్ వస్తుందా?

మత్తు వదలరా మూవీ తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడీ సీక్వెల్ మంచి ఓపెనింగ్స్ సాధించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పైగా రిలీజ్ డేట్ ఇప్పుడే అనౌన్స్ చేయడంతో రానున్న రోజుల్లో ప్రమోషన్ల జోరును కూడా పెంచనున్నారు.

ఆ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన వాళ్లే ఈ సీక్వెల్లోనూ కొనసాగనున్నారు. ఫరియా అబ్దుల్లా ఫిమేల్ లీడ్ గా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందించాడు.

మత్తు వదలరా సీక్వెల్ అందుకేనా?

కీరవాణి తనయుడు శ్రీ సింహ కూడా మత్తు వదలరా మూవీ ద్వారానే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్, హీరోకి ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చినా.. తర్వాత వీళ్లు ఆ సక్సెస్ ను నిలుపుకోలేకపోయారు. శ్రీ సింహ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ లాంటి సినిమాలు చేసినా.. విజయం అందుకోలేకపోయాడు.

అటు డైరెక్టర్ రితేష్ కూడా హ్యాపీ బర్త్ డే మూవీ చేశాడు. ఈ కామెడీ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తమకు మంచి సక్సెస్ ఇచ్చిన మత్తు వదలరా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఈ కాంబో నిర్ణయించారు. నిజానికి మొదట హ్యాపీ బర్త్ డే సీక్వెల్ తీయాలని రితేష్ నిర్ణయించినా.. తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మత్త వదలరా మూవీలో బాబు, యేసు అనే డెలివరీ ఏజెంట్ల పాత్రలు పోషించారు శ్రీసింహ, సత్య. తెలుగులో థ్రిల్లర్ మూవీస్ కి ఓ కొత్త అర్థం చెప్పిన సినిమాగా దీనిని చెప్పొచ్చు. డైరెక్టర్ రితేష్ కు ఇదే తొలి సినిమా అంటే నమ్మలేం. అంత పక్కాగా స్క్రిప్ట్ వర్క్ తో మత్తు వదలరాను తెరకెక్కించాడు. ఇప్పుడు సీక్వెల్ ను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తాడన్న అంచనా ప్రేక్షకుల్లో ఉంది.