Mansion 24 OTT Series: ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! స్ట్రీమింగ్ డేట్ ఖరారు-mansion 24 ott release date and trailer revealed officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mansion 24 Ott Series: ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Mansion 24 OTT Series: ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 04, 2023 01:58 PM IST

Mansion 24 OTT Release: ‘మ్యాన్షన్ 24’ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‍కు ఓంకార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ కూడా ఖరారైంది.

Mansion 24 OTT Release: ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! (Photo: Disney+)
Mansion 24 OTT Release: ఓంకార్ హర్రర్ థ్రిల్లర్ ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేలా! (Photo: Disney+)

Mansion 24 OTT Release: టెలివిజన్ స్టార్ ఓంకార్ దర్శకత్వం వహించిన ‘మ్యాన్షన్ 24’ వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చేసింది. ఈ హర్రర్ థ్రిల్లర్‌లో వరలక్ష్మి శరత్‍కుమార్, సత్యరాజ్ (బాహుబలిలో కట్టప్ప), అవికాగోర్, బిందు మాధవి ప్రధాన పాత్రలు పోషించారు. ఓంకార్ దర్శకత్వంతో పాటు ప్రముఖ నటీనటులు ఉండటంతో ఆరంభం నుంచి మ్యాన్షన్ 24పై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్‍లు కూడా సస్పెన్స్ పెంచాయి. ఈ క్రమంలో మ్యాన్షన్ 24 ట్రైలర్ నేడు (అక్టోబర్ 4) వచ్చింది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. వివరాలివే..

తన తండ్రి కాళిదాస్ (సత్యరాజ్)పై దేశద్రోహి అనే నింద పడటంతో.. నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఆయనను అన్వేషించేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ నిర్ణయించుకుంటారు. తన తండ్రి నిజాయితీ పరుడని బలంగా చెబుతారు. ఈ క్రమంలో కాళిదాస్ ఓ పురాతన భవనంలోకి వెళ్లి మాయమయ్యారని తెలుసుకుంటారు. తన తల్లి ఆరోగ్యం బాగవ్వాలంటే కూడా తండ్రిని తిరిగి తీసుకురావాలని అనుకుంటారు. అందుకే పాడుబడ్డ మ్యాన్షన్‍కు వెళ్లాలని డిసైడ్ అవుతారు. అయితే, అందులోకి వెళ్లిన వారు ఇప్పటి తిరిగి రాలేదని, ఆమెను కూడా వెళ్లవద్దని చాలా మంది చెబుతారు. అయితే, వరలక్ష్మి మాత్రం ఆ మ్యాన్షన్‍లోకి వెళతారు. ఇక్కడ దెయ్యాలు వరలక్ష్మి కంటబడతాయి. అవికాగోర్, బిందుమాధవి, రాజీవ్ కనకాల కూడా ట్రైలర్లో కనిపించారు. ఓ ప్లాష్‍బ్యాక్ కూడా ఉన్నట్టు ఉన్నట్టు తెలుస్తోంది. మరి నిజంగా ఆ మ్యాన్షన్‍లో దెయ్యాలు ఉన్నాయా..? ఆ భవనం మిస్టరీ ఏంటి.. కాళిదాస్ ఏమయ్యారు? అనేదే ఈ సిరీస్ ప్రధాన కథగా ఉండనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

మ్యాన్షన్‍ 24 వెబ్ సిరీస్‍లో అర్చన జోయిస్, శ్రీమాన్, రావురమేశ్, అమర్ దీప్, నందు, మానస్, తులసి కూడా కీలకపాత్రలు పోషించారు. వికాస్ బాడిస సంగీతం అందించారు. ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మంచి సస్పెన్స్‌గా సాగింది.

‘మ్యాన్షన్‍ 24’ను ఓంకార్, అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తి సంయుక్తంగా నిర్మించారు. ఓంకార్ దర్శకత్వం వహించారు.

‘మ్యాన్షన్‍ 24’ స్ట్రీమింగ్ డేట్

‘మ్యాన్షన్‍ 24’ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్ ద్వారా హాట్‍స్టార్ వెల్లడించింది.

IPL_Entry_Point