Mangalavaram OTT Release Date: పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ మూవీ ఓటీటీలోకి ఈనెలలోనే.. ఆ రోజే రానుందా!-mangalavaaram film digital streaming expected ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mangalavaram Ott Release Date: పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ మూవీ ఓటీటీలోకి ఈనెలలోనే.. ఆ రోజే రానుందా!

Mangalavaram OTT Release Date: పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ మూవీ ఓటీటీలోకి ఈనెలలోనే.. ఆ రోజే రానుందా!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 08, 2023 07:05 PM IST

Mangalavaram OTT Release Date: మంగళవారం సినిమా డిసెంబర్లోనే ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ గురించిన వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.

Mangalavaram OTT Release Date: పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ మూవీ ఓటీటీలోకి ఈనెలలోనే.. ఆ రోజే రానుందా!
Mangalavaram OTT Release Date: పాయల్ రాజ్‍పుత్ ‘మంగళవారం’ మూవీ ఓటీటీలోకి ఈనెలలోనే.. ఆ రోజే రానుందా!

Mangalavaram OTT Release Date: పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన మంగళవారం సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది. ఆర్ఎక్స్100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రోమోషన్లను భారీగా చేయడం, ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించటంతో మంగళవారం సినిమాపై భారీ హైప్‍ ఏర్పడింది. అందుకు తగ్గట్టే మంచి కలెక్షన్లను కూడా ఈ చిత్రం రాబట్టుకుంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.

మంగళవారం సినిమా ఈనెల (డిసెంబర్)లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ డిసెంబర్ 22న ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలవుతుందని సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. స్ట్రీమింగ్ డేట్‍ను హాట్‍స్టార్ త్వరలోనే ప్రకటించనుంది.

మరోవైపు, మంగళవారం సినిమా తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా వస్తుందనే రూమర్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‍పుత్‍తో పాటు నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రవణ్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని అజయ్ భూపతి తెరకెక్కించిన విధానం చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.

మంగళవారం సినిమాకు అజ్నిశ్ లోకనాథ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రానికి శివేంద్ర దాశరథి సినిమాటోగ్రపీ చేయగా.. మాధవ్ కుమార్ ఎడిటింగ్ చేశారు.

మహాలక్ష్మిపురంలో ఆ గ్రామ దేవతకు ఇష్టమైన మంగళవారం రోజున కొన్ని మరణాలు సంభవిస్తాయి. వరుసగా కొన్ని వారాలు ఇలా మరణాలు జరుగుతాయి. అయితే, ఆ మరణాల వెనుక మిస్టరీ ఏంటి.. అవి ఆత్మహత్యలా, హత్యలా అన్నదే ఈ మంగళవారం సినిమా ప్రధాన కథగా ఉంది.

IPL_Entry_Point