Manchu Brothers Controversy: ఇది చిన్న గొడవ.. పట్టించుకోవద్దు.. మనోజ్ వీడియోపై స్పందించిన మంచు విష్ణు-manchu vishnu reaction on manchu manoj video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Brothers Controversy: ఇది చిన్న గొడవ.. పట్టించుకోవద్దు.. మనోజ్ వీడియోపై స్పందించిన మంచు విష్ణు

Manchu Brothers Controversy: ఇది చిన్న గొడవ.. పట్టించుకోవద్దు.. మనోజ్ వీడియోపై స్పందించిన మంచు విష్ణు

Maragani Govardhan HT Telugu
Mar 24, 2023 04:12 PM IST

Manchu Brothers Controversy: తన సోదరుడు మంచు విష్ణు తన అనుచరులపై దాడికి పాల్పడుతున్నాడంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విష్ణు స్పందిస్తూ.. ఇదో చిన్న గొడవని, వదిలేయాల్సిందిగా కోరాడు.

మంచు విష్ణు-మంచు మనోజ్
మంచు విష్ణు-మంచు మనోజ్

Manchu Brothers Controversy: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. రెండేళ్లు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని, వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మనోజ్ పెళ్లికి కూడా విష్ణు అతిథి మాదిరిగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. దీంతో వీరి మధ్య విభేదాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. తాజాగా మనోజ్ విడుదల చేసిన వీడియోతో ఆ గొడవలు మరింత పెరిగాయి. విష్ణుఅన్న తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీంతో మంచు మోహన్ బాబు చొరవతో మనోజ్ ఆ వీడియోను వెంటనే తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ఈ వీడియోపై, మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందించాడు. "ఇది నిన్న మా ఇద్దరి మధ్య జరిగిన చాలా చిన్న గొడవ. ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగడం మా మధ్య సర్వసాధారణమే. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేదు. కానీ వీడియో తీసి పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్నవాడు. ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని భూతద్దంలో చూడొద్దు. మావాడు ఏదో ఆవేశంలో పోస్ట్ చేశాడు." విష్ణు అని వివరణ ఇచ్చాడు.

మంచు విష్ణు స్పందన బట్టి ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ చాలా లైట్‌గా తీసుకున్నట్లు తెలిసింది. అయితే మనోజ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా రంగంలో మోహన్ బాబు దిగి పరిస్థితిని చక్కబెట్టినట్లు తెలుస్తోంది.

త‌న బంధువుల ఇంటిపై మంచు విష్ణు దాడిచేయ‌డానికి ప్ర‌య‌త్నించిన వీడియోను మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. వీడియోను గమనిస్తే విష్ణు దూకుడుగా క‌నిపిస్తుండ‌గా అత‌డిని కొంద‌రు ఆపుతూ క‌నిపించారు.అరేయ్ ఒరేయ్ అని వాడు ఏదో అంటున్నాడు క‌దా అని విష్ణు అరుస్తూ క‌నిపించాడు. ఇళ్ల‌ల్లోకి వ‌చ్చి మా వాళ్ల‌ను బంధువుల్ని ఇలా కొడుతుంటాడు. ఇది సిట్యువేష‌న్ అంటూ మంచు మ‌నోజ్ వాయిస్ ఈ వీడియోలో వినిపిస్తుంది. అయితే మంచు మ‌నోజ్‌కు స‌న్నిహితుడైన సార‌థి అనే వ్య‌క్తిపై విష్ణు దాడికి పాల్ప‌డేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point

టాపిక్