Mahesh Babu Net Worth : మహేశ్ బాబు ఆస్తులు ఎంతో తెలుసా?-mahesh babu net worth how much does mahesh babu earn ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Net Worth : మహేశ్ బాబు ఆస్తులు ఎంతో తెలుసా?

Mahesh Babu Net Worth : మహేశ్ బాబు ఆస్తులు ఎంతో తెలుసా?

Anand Sai HT Telugu
Aug 11, 2023 12:43 PM IST

Mahesh Babu Net Worth : మహేశ్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అయితే.. ఆయన ఆస్తులు ఎంతో తెలుసా?

మహేశ్ బాబు
మహేశ్ బాబు

తెలుగు ఇండస్ట్రీలో మహేశ్ బాబు(Mahesh Babu)ది ప్రత్యేక స్థానం. ఆయన సినిమా జీవితమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా చాలా మందికి స్ఫూర్తి. ఇటీవలే ఆయన బర్త్ డే జరుపుకొన్నారు. ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినిమాతో పాటు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా మంచి గుర్తింపు పొందారు మహేశ్ బాబు.

మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. దీంతో పాటు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు ఆయన సహకారం అందుతోంది. ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు.

బాలనటుడిగా సినిమాల్లో నటించారు మహేశ్ బాబు. 1999లో విడుదలైన రాజకుమారుడు(Rajakumarudu)తో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రతి సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 2005లో మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. వీరికి గౌతమ్, సితార పిల్లలు ఉన్నారు. మహేష్ బాబు మొత్తం ఆస్తులు 256 కోట్ల రూపాయలు. మహేష్ బాబు నటన, బ్రాండ్‌లను ప్రచారం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాడు.

మహేష్ బాబుకు హైదరాబాద్‌లో పెద్ద బంగ్లా ఉంది. దీని విలువ 28 కోట్ల రూపాయలు. ఇటీవలే బెంగళూరులో ఇల్లు కొన్నారు. మహేష్ బాబుకు రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి కార్లను ఉన్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లోని ఏషియన్ సినిమాస్‌లో మహేష్ బాబు భాగస్వామి. ఇది 2021లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని విలాసవంతమైన థియేటర్లలో ఇది కూడా ఒకటి. మహేష్ బాబుకు సొంతంగా రెస్టారెంట్ కూడా ఉంది.

ప్రస్తుతం మహేశ్ బాబు.. గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ, సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.