Mahesh Babu Birthday: మ‌హేష్ లుంగీ పోస్ట‌ర్ అదుర్స్ - గుంటూరు కారం సంక్రాంతికి రావ‌డం ప‌క్కా!-mahesh babu birthday guntur kaaram team unveils mahesh babu special on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Birthday: మ‌హేష్ లుంగీ పోస్ట‌ర్ అదుర్స్ - గుంటూరు కారం సంక్రాంతికి రావ‌డం ప‌క్కా!

Mahesh Babu Birthday: మ‌హేష్ లుంగీ పోస్ట‌ర్ అదుర్స్ - గుంటూరు కారం సంక్రాంతికి రావ‌డం ప‌క్కా!

HT Telugu Desk HT Telugu
Aug 09, 2023 06:22 AM IST

Mahesh Babu Birthday: త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మాస్ లుక్‌లో క‌నిపించి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు మ‌హేష్‌బాబు. గుంటూర్ కారం సినిమా నుంచి మ‌హేష్‌బాబు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌హేష్ బాబు
మ‌హేష్ బాబు

Mahesh Babu Birthday: మ‌హేష్ బాబు (Mahesh babu) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గుంటూర్ కారం టీమ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మ‌హేష్‌బాబు స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో లుంగీ ధ‌రించి కాల‌ర్ పైకి ఎగుర‌వేసి బీడీ వెలిగిస్తూ మాస్ లుక్‌లో మ‌హేష్ బాబు క‌నిపిస్తున్నారు. గ‌త సినిమాల‌కు భిన్నంగా మ‌హేష్‌బాబులోని మాస్ కోణాన్ని ప‌తాక స్థాయిలో ఈ సినిమాతో డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఈ లుంగీ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హేష్ అభిమానుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. గుంటూరు కారం సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లుగా కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కొత్త పోస్ట‌ర్ ద్వారా రిలీజ్ పుకార్ల‌కు సినిమా యూనిట్ పుల్‌స్టాప్ పెట్టింది. ప్ర‌క‌టించిన తేదీనే జ‌న‌వ‌రి 12న గుంటూరుకారం సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని అనౌన్స్‌చేశారు. మ‌హేష్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తొలుత గుంటూర్ కారం ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ చివ‌రి నిమిషంలో ఈ నిర్ణ‌యంలో మార్పు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఫ‌స్ట్ సింగిల్ బ‌దులుగా ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు రిలీజ్ చేశారు.

గుంటూర్ కారం సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్(Trivikram) కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది.

Whats_app_banner