Range Rover Velar : 2023 రేంజ్ రోవర్ వేలర్ లాంచ్.. ధర రూ. 93లక్షలు
2023 Range Rover Velar launch : రేంజ్ రోవర్ వేలర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర రూ.93లక్షలు!
2023 Range Rover Velar launch : ఇండియాలో 2023 రేంజ్ రోవల్ వేలర్ను తాజాగా లాంచ్ చేసింది జాగ్యువర్ ల్యాండ్ రోవర్ సంస్థ. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ నుంచి డెలివరీలు మొదలుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాము..
వేలర్ ఎస్యూవీ స్పెసిఫికేషన్స్..
రేంజ్ రోవల్ వేలర్‌కు ఇది ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. లుక్స్, సస్పెన్షన్స్ మెరుగుపడ్డాయి. పలు కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. ఒకటే వేరియంట్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మోడల్ లాంచ్‌తో.. ఇండియాలో లగ్జరీ వాహనాల సెగ్మెంట్లో పోటీ మరింత పెరిగిందని చెప్పుకోవాలి.
2023 Range Rover Velar price : ఇక ఈ కొత్త ఎస్యూవీ బానెట్‌పై 'రేంజ్ రోవర్' అని రాసి ఉంటుంది. వైడ్ గ్రిల్, పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, వైడ్ ఎయిర్ వెంట్ వంటివి ఫ్రెంట్లో వస్తున్నాయి. బ్లాక్ పిల్లర్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, డిజైనర్ అలాయ్ వీల్స్ సైతం లభిస్తున్నాయి. ఇక రేర్‌లో షార్క్ ఫిన్ యాంటీనా, రేక్డ్ విండ్‌స్క్రీన్, వ్రాప్ అరౌండ్ టెయిల్‌ల్యాంప్స్, రీడిజైన్డ్ బంపర్ వంటివి వస్తున్నాయి.
ఇదీ చూడండి:- India's first self-driving car: భారతదేశ తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించిన బెంగళూరు స్టార్ట్ అప్ కంపెనీ
ఇక ఫీచర్స్ విషయానికొస్తే ఈ 2023 రేంజ్ రోవర్ వేలర్లో కేబిన్ లగ్జరీగా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫయర్, హీటెడ్ సీట్స్, రీ డిజైన్డ్ డాష్‌బోర్డ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్లీనర్ సెంటర్ కన్సోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్లు ఉన్నాయి. వయర్లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 11.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి కేబిన్‌లో ఉన్నాయి.
ఇక సేఫ్టీ కోసం ఈ లగ్జరీ ఎస్‌యూవీలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, టెర్రైన్ రెస్పాన్స్ వంటి ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఇంజిన్.. ధర వివరాలివే..
Range Rover Velar facelift features : ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 250 హెచ్‌పీ పవర్‌ను, 365 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇక 2.0 లీటర్, మైల్డ్ హైబ్రీడ్ డీజిల్ ఇంజిన్.. 204 హెచ్‌పీ పవర్‌ను, 430 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 0-100 కేఎంపీహెచ్ స్పీడ్‌ను కేవలం 7.5 సెకన్స్‌లో అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 217 కేఎంపీహెచ్.
ఇక 2023 రేంజ్ రోవర్ వేలర్ ఎక్స్‌షోరూం ధర రూ. 93లక్షలు. పాత మోడల్‌తో పోల్చుకుంటే ఇది రూ. 3.59లక్షలు ఎక్కువే!
Range Rover Velar 2023 : ఇది ఇలా ఉండగా.. ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా.. రేంజ్ రోవర్ వేలర్ పాత మోడల్‌ను ఇటీవలే తన కలెక్షన్లో యాడ్ చేసుకున్నాడు. హరియాణాలోని ఓ షోరూమ్ నుంచి ఈ ఎస్‌యూవీని ఇంటికి నడిపాడు. ఆయన కలెక్షన్లో ఇప్పటికే చాలా బైక్స్, కార్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం