Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ రిలీజ్‌లు ఇవే - సోలోగా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన ఖుషి-kushi to manmadhudu telugu movies releasing this week in theaters ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ రిలీజ్‌లు ఇవే - సోలోగా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన ఖుషి

Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ రిలీజ్‌లు ఇవే - సోలోగా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన ఖుషి

HT Telugu Desk HT Telugu
Aug 28, 2023 05:47 AM IST

Movies In Theaters This Week: ఈ శుక్ర‌వారం విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి మూవీ సోలోగా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఖుషితో ఈ పాటు ఈ వారం రీ రిలీజ్ మూవీస్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

స‌మంత, విజ‌య్ దేవ‌ర‌కొండ‌,
స‌మంత, విజ‌య్ దేవ‌ర‌కొండ‌,

Movies In Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో విజ‌య్ దేవ‌ర‌కొండ సోలోగా దిగ‌బోతున్నాడు. ఖుషి సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. విజ‌య్ మూవీతో పాటు ఈ వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Deverakonda), స‌మంత (Samantha) జంట‌గా న‌టించిన ఖుషి మూవీ సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పాట‌లు, ట్రైల‌ర్స్‌తో ఖుషిపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి.

గీత‌ గోవిందం, టాక్సీవాలా త‌ర్వాత స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఖుషి స‌క్సెస్ కీల‌కంగా మారింది. అత‌డి ఎదురుచూపుల‌కు త‌గ్గ ఫ‌లితం ఈ సినిమాతో ల‌భిస్తుందా? లేదా? అన్న‌ది మ‌రో నాలుగు రోజుల్లో తేల‌నుంది. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది.

ఖుషితో పాటు సెప్టెంబ‌ర్ 1న నానీ ప్రేమ‌క‌థ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అలాగే త‌మిళ క‌మెడియ‌న్ సంతానం హీరోగా న‌టించిన కిక్ మూవీ సెప్టెంబ‌ర్ 1న తెలుగులో రిలీజ్ కాబోతోంది.

రీ రిలీజ్ మూవీస్ హంగామా...

ఈ వారం స్ట్రెయిట్ సినిమాలంటే కంటే రీ రిలీజ్ మూవీస్ ఎక్కువ‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి. నాగార్జున(Nagarjuna) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌డి కెరీర్‌లో ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌లో ఒక‌టైన మ‌న్మ‌థుడు మూవీ ఆగ‌స్ట్ 29న రీ రిలీజ్ కాబోతోంది. త్రివిక్ర‌మ్ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన‌రోజు ను పుర‌స్క‌రించుకొని గుడుంబాశంక‌ర్ సినిమాను సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే మ‌న్మ‌థుడుతో పాటు గుడుంబా శంక‌ర్ అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. అలాగే బాల‌కృష్ణ భైర‌వ‌ద్వీపం మూవీ కూడా ఆగ‌స్ట్ 30 రీ రిలీజ్ కానుంది.

IPL_Entry_Point