Kushi OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?-kushi ott release date when and where to watch vijay devarakonda samantha romantic entertainer movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi Ott Release Date: నెట్‌ఫ్లిక్స్‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Kushi OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లోకి విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

HT Telugu Desk HT Telugu
Sep 07, 2023 10:21 AM IST

Kushi OTT Release Date: విజ‌య్‌దేవ‌ర‌కొండ ఖుషి సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమా ఎప్ప‌టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉందంటే?

విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత
విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత

Kushi OTT Release Date: విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ఖుషి మూవీ థియేట‌ర్ల‌లో డీసెంట్ ఓపెనింగ్స్‌ను రాబోడుతోంది. సెప్టెంబ‌ర్ 1న రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లో 65 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బ్రేక్ ఈవెన్ దిశ‌గా దూసుకుపోతోంది.

రొమాంటిక్ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టించింది. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకొంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌కు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 90 కోట్ల‌కు ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హ‌క్కులు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. అక్టోబ‌ర్ 6 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. నాస్తిక కుటుంబంలో పుట్టిన అబ్బాయి, ఆచారాలు, సంస్కృతుల‌కు ప్రాముఖ్య‌త‌నిచ్చే ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు? కుటుంబ సిద్ధాంతాలు, న‌మ్మ‌కాలు వారి ప్రేమ‌కు ఏ విధంగా అడ్డంకిగా మారాయ‌నే పాయింట్‌తో సింపుల్ ఎమోష‌న్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ ఖుషి సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత (Samantha) జంట‌గా న‌టించిన సినిమా ఇది. వెన్నెల‌కిషోర్‌, శ‌ర‌ణ్య‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌చిన్ ఖేడ్క‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో ఈ సినిమా స‌క్సెస్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఖుషి ప్ర‌మోష‌న్స్‌కు దూర‌మైన స‌మంత ఈ స‌క్సెస్ మీట్‌లో పాల్గొన‌బోతున్న‌ట్లు స‌మాచారం.

టీ20 వరల్డ్ కప్ 2024