Kotabommali PS OTT: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా కోట బొమ్మాళి పీఎస్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kotabommali PS OTT Streaming: సీనియర్ హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు లీక్ అయ్యాయి. కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే వివరాల్లోకి వెళితే..
శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ హీరోహీరోయిన్లుగా మేక శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించిన కొత్త తెలుగు చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించిన కోట బొమ్మాళి పీఎస్ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది.
కోట బొమ్మాళి పీఎస్ సినిమా రిలీజైన రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో సినిమాకు ప్రేక్షకులు బాగానే వస్తున్నారు. ఈవారం మంచి టాక్‌తో దూసుకుపోతున్న కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కోట బొమ్మాళి పీఎస్ మూవీని ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. అంటే, కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత అంటే, నెలకు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారు. లేదా సినిమా టాక్‌ని బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు ఉంటాయి.
ఈ నేపథ్యంలో కోట బొమ్మాళి పీఎస్ మూవీని ఓటీటీలోకి నెల రోజలకు స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, డిసెంబర్ చివరి వారంలో కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం అందించారు. జగదీశ్ చీకటి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.