Kangana Ranaut | మీ పుకార్ల వల్లే నాకు పెళ్లి కావడం లేదు: కంగనా రనౌత్‌-kangana ranaut jokingly says that rumors about her are the reason behind her not getting married ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut | మీ పుకార్ల వల్లే నాకు పెళ్లి కావడం లేదు: కంగనా రనౌత్‌

Kangana Ranaut | మీ పుకార్ల వల్లే నాకు పెళ్లి కావడం లేదు: కంగనా రనౌత్‌

HT Telugu Desk HT Telugu
May 12, 2022 11:03 AM IST

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌కు ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది. ఏదైనా సూటిగా మాట్లాడేస్తుంది. తరచూ నోరు జారుతూ వివాదాల్లో ఇరుక్కుంటుంది. అలాంటి కంగనా.. తాజాగా తన పెళ్లిపై చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

<p>ధాకడ్ మూవీ ప్రమోషన్లలో కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్</p>
ధాకడ్ మూవీ ప్రమోషన్లలో కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్ (PTI)

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ధాకడ్‌ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది. ఈ ధాకడ్‌ సినిమాలో కంగనా ఏజెంట్‌ అగ్ని అనే ఓ గూఢచారి పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. మీరు నిజ జీవితంలోనూ ఇలాగే మగరాయుడిలా ఉంటారా అని అతడు ప్రశ్నించగా.. కంగనా నవ్వుతూ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

మీరు ఇలాంటి పుకార్లు పుట్టించడం వల్లే తనకు పెళ్లి కావడం లేదని, తాను అందరితో ఊరికే ఫైట్‌ చేస్తానన్న బయట జనాలు అనుకుంటున్నారని ఆమె చెప్పింది. "ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. కానీ నిజ జీవితంలో నేను ఎవరిని కొడతాను చెప్పండి? మీలాంటి వాళ్లు ఇలాంటి పుకార్లు పుట్టించడం వల్ల నాకు పెళ్లి కూడా కావడం లేదు" అని కంగనా నవ్వుతూ చెప్పింది.

నువ్వు కఠినంగా ఉంటావన్న పుకార్ల వల్లే పెళ్లి కావడం లేదా అని సిద్ధార్థ్‌ ప్రశ్నించగా.. అవును, నేను అబ్బాయిలను కొడతాను అన్న పుకార్ల వల్లే నాకు పెళ్లి జరగడం లేదు అని మరోసారి నవ్వుతూ సమాధానమిచ్చింది. ఈ ధాకడ్‌ సినిమాలో కంగనా కోస్టార్‌గా ఉన్న అర్జున్‌ రాంపాల్‌ కూడా ఈ ఇంటర్వ్యూలో ఉన్నాడు. అయితే అతడు మాత్రం కంగనాలో ఉన్న మంచి లక్షణాల గురించి చెప్పాడు.

మీరు ఇలాంటి పుకార్లను పుట్టించొద్దు అని సిద్ధార్థ్‌ను అర్జున్‌ కోరడం విశేషం. "కంగనా మంచి నటి. ఆమె ఏం చేసినా సినిమాలో పాత్ర కోసమే చేస్తుంది. కానీ నిజ జీవితంలో ఆమె అలాంటిది కాదు. ఆమె చాలా స్వీట్‌. ప్రేమగా ఉంటుంది. దేవుడంటే భయం. రోజూ పూజలు చేస్తుంది. యోగా చేస్తుంది. ఆమె చాలా సాధారణంగా ఉంటుంది" అని అర్జున్‌ రాంపాల్ చెప్పాడు.

ఈ ధాకడ్‌ సినిమా కోసం కంగనా చాలానే కష్టపడింది. ఓ స్పై ఏజెంట్‌ పాత్రకు తగినట్లు తనను తాను మలచుకుంది. మూవీలోని స్టంట్స్‌ను కూడా సొంతంగా చేసింది. ఈ మూవీలో కంగనా, అర్జున్‌ రాంపాల్‌ కాకుండా దివ్యా దత్తా కూడా నటిస్తోంది. రజ్నీష్‌ ఘాయ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 20న సినిమా రిలీజ్‌ కానుంది.

Whats_app_banner