Hollywood Movie: హాలీవుడ్ మూవీలో న‌టించిన ఫ‌స్ట్ సౌత్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?-kamal haasan to rajinikanth south actors who have done movies in hollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hollywood Movie: హాలీవుడ్ మూవీలో న‌టించిన ఫ‌స్ట్ సౌత్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Hollywood Movie: హాలీవుడ్ మూవీలో న‌టించిన ఫ‌స్ట్ సౌత్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Nelki Naresh Kumar HT Telugu
Mar 22, 2024 12:53 PM IST

Hollywood Movie: సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి హాలీవుడ్ సినిమాలో న‌టించిన మొద‌టి హీరోగా క‌మ‌ల్‌హాస‌న్ నిలిచాడు. 1985లో రిలీజైన‌ ది జువెల్ ఇన్ ఇన్ ది క్రౌన్ హాలీవుడ్ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ ఓ కీల‌క పాత్ర చేశాడు.

క‌మ‌ల్‌హాస‌న్
క‌మ‌ల్‌హాస‌న్

Hollywood Movie: ప్ర‌స్తుతం సినిమాల విష‌యంలో భాషాప‌ర‌మైన హ‌ద్దులు తొల‌గిపోయాయి. బాలీవుడ్‌, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాష‌ల్లో న‌టీన‌టులు సినిమాలు చేస్తున్నారు. హాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై కోలీవుడ్‌, టాలీవుడ్‌ యాక్ట‌ర్స్ మెరుస్తున్నారు. ది గ్రేన్ మ్యాన్ సినిమాలో త‌మిళ‌ అగ్ర హీరో ధ‌నుష్ కీల‌క పాత్ర పోషించాడు. మంకీ మ్యాన్‌లో తెలుగు హీరోయిజ్ శోభిత దూళిపాళ్ల ఓ గ్లామ‌ర్ రోల్ చేస్తోంది. హాలీవుడ్‌లో సౌత్ యాక్ట‌ర్స్ క‌నిపించ‌డం కామ‌న్ అయిపోయింది.

క‌మ‌ల్‌హాస‌న్ హాలీవుడ్ ఎంట్రీ...

సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి హాలీవుడ్‌లో సినిమా చేసిన ఫ‌స్ట్ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు. క‌మ‌ల్‌హాస‌న్‌. 1985లో ది జువెల్ ఇన్ ది క్రౌన్ పేరుతో ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‌ను ఆ త‌ర్వాత సినిమాగా ఎడిట్ చేసి 1985లో రిలీజ్ చేశారు.

ఇందులో కెప్టెన్ సామ ద‌స్తూర్ అనే ఇండియ‌న్ ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌మ‌ల్‌హాస‌న్ క‌నిపించాడు. ఇండియాకు స్వాతం త్య్రం ప్ర‌క‌టించే స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాలు, చివ‌రి రోజుల్లో ఆంగ్లేయుల పాల‌న నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కింది. చిన్న రోల్ అయినా క‌మ‌ల్‌కు ఈ హాలీవుడ్ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ది జువెల్ ఇన్ ఇన్ ది క్రౌన్ త‌ర్వాత రాంబో 3, స్టార్ టెక్‌తో పాటు భారీ బ‌డ్జెట్ హాలీవుడ్ సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా క‌మ‌ల్ హాస‌న్ చేయ‌లేక‌పోయారు.

బ్ల‌డ్ స్టోన్‌...

క‌మ‌ల్‌హాస‌న్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ బ్ల‌డ్‌స్టోన్ అనే హాలీవుడ్ మూవీలో న‌టించాడు. సుదీర్ఘ కెరీర్‌లో ర‌జ‌నీకాంత్ చేసిన ఒకే ఒక హాలీవుడ్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో శ్యామ్ సాబు అనే టాక్సీ డ్రైవ‌ర్‌గా ర‌జ‌నీకాంత్ క‌నిపించాడు. హాలీవుడ్‌లో ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ హాలీవుడ్ మూవీని వైర‌వేల్ పేరుతో త‌మిళంలో రీమేక్ చేశారు.

ధ‌నుష్ గ్రే మ్యాన్‌...

నేటి త‌రంలో హాలీవుడ్‌లో చాలా మంది హీరోలుహీరోయిన్లు సినిమాలు చేస్తున్నారు. ది నేమ్‌సేక్ మూవీతో 2006లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ట‌బు. హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ లైఫ్ ఆఫ్ పైలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది.

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్ ట్రాప్ సిటీ అనే సినిమాలో ఓ చిన్న రోల్‌లో క‌నిపించాడు. క్రిస్ ఇవాన్స్ హీరోగా న‌టించిన ది గ్రే మ్యాన్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ధ‌నుష్ న‌టించాడు. త‌న యాక్టింగ్‌తో హాలీవుడ్ ఫ్యాన్స్‌ను ధ‌నుష్ మెప్పించాడు. ఈ సినిమాకు అవెంజ‌ర్స్ ఫేమ్ జాయ్ రూసో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ నెపోలియ‌న్ క్రిస్మ‌స్ కూప‌న్, డెవిల్స్ నైట్ సినిమాల్లో న‌టించాడు. తెలుగు హీరోయిన్ శోభితా దూలిపాళ్ల ది మంకీ మ్యాన్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

ఐదు సినిమాల‌తో బిజీ...

కాగా ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ ఐదు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఇండియ‌న్ 2 మూవీ షూటింగ్ పూర్త‌యింది.

ఇండియ‌న్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం క‌ల‌యిక‌లో దాదాపు 35 ఏళ్ల త‌ర్వాత థ‌గ్ లైఫ్ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. తెలుగులో ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా మే 9న రిలీజ్ కాబోతోంది.

Whats_app_banner