Kajal Ghosty Movie: డిజాస్టర్ టాక్ తెచ్చుకొన్న కాజల్ హారర్ మూవీ - రెండో రోజుకే సగం థియేటర్లు ఎత్తేశారుగా
Kajal Ghosty Movie: తమిళ సినిమా ఘోస్టీతో ఇటీవలే లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల్ని పలకరించింది కాజల్ అగర్వాల్. హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్‌కు టాక్‌ను తెచ్చుకొని కాజల్‌కు షాక్ ఇచ్చింది.
Kajal Ghosty Movie: పెళ్లి.. ఆ తర్వాత మాతృత్వబంధంతో ఏడాదిన్నరపైనే సినిమాలకు దూరమైంది కాజల్.తమిళ సినిమా ఘోస్టీతో ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. తొలిసారి హారర్ కథాంశంతో కాజల్ చేసిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. కోలీవుడ్‌లో మార్చి 17న ఘోస్టీ సినిమా రిలీజైంది.
ఇందులో కాజల్ సినిమా హీరోయిన్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డ్యూయల్ రోల్‌లో నటించింది. కాజల్ రీఎంట్రీ మూవీ కావడం, స్టార్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలో నటించడంతో రిలీజ్‌కు ముందు ఘోస్టీ సినిమా కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తించింది. రొటీన్ హారర్ కథాంశంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం అటు నవ్వించలేక ఇటు భయపెట్టక డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకున్నది.
మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దాంతో రెండో రోజుకే తమిళంలో సగం థియేటర్లను ఎత్తేశారు.బుకింగ్ యాప్స్‌లో ఘోస్టీ థియేటర్లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతుండటంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోన్నారు.
కాజల్ సెకండ్ ఇన్నింగ్స్‌ను డిజాస్టర్‌తో ప్రారంభమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. కాగా ఘోస్టీ తెలుగు వెర్షన్ మార్చి 22న రిలీజ్ కానుంది. తమిళంలోనే డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా ప్రస్తుతం కాజల్ ఇండియన్ -2 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. అలాగే తెలుగులో బాలకృష్ణతో ఓ సినిమా చేస్తోంది