Devara Movie Live Updates:థియేటర్ వద్ద అగ్ని ప్రమాదం - మంటల్లో కాలిపోయిన ఎన్టీఆర్ భారీ కటౌట్
దేవర మూవీతో ఎన్టీఆర్ ఆరేళ్ల తరువాత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మాస్ యాక్షన్ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. శుక్రవారం మిడ్‌నైట్ షోస్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో దేవర ప్రభంజనం మొదలైంది.
Fri, 27 Sep 202406:23 AM IST
కాలిపోయిన ఎన్టీఆర్ కటౌట్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సుదర్శన్ థియేటర్ వద్ద పెట్టిన ఎన్టీఆర్ భారీ కటౌట్ అగ్ని ప్రమాదం కారణం దగ్ధమైంది. దేవర రిలీజ్ సందర్భంగా అభిమానులు టపాసులు కాల్చడంతో నిప్పురవ్వలు ఎగసి కటౌట్ మీద పడటంతో కాలిపోయినట్లు సమాచారం.
Fri, 27 Sep 202405:22 AM IST
దేవర థియేటర్‌లో ఎన్టీఆర్ అభిమాని మృతి
దేవర మూవీ చూస్తూ థియేటర్‌లోనే అభిమాని కన్నుమూసిన విషాద సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. సీకే దిన్నే మండంలోని జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలీ కడప అప్సర థియేటర్‌లో దేవర మూవీ చూస్తూ కుప్పకూలిపోయాడు. సన్నిహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
Fri, 27 Sep 202404:51 AM IST
ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్
దేవర వరల్డ్ వైడ్‌గా 182 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది.
Fri, 27 Sep 202404:17 AM IST
కల్కి కంటే తక్కువే!
దేవర సినిమాకు వరల్డ్ వైడ్‌గా తొలి రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ కంటే తక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.
Fri, 27 Sep 202403:46 AM IST
ఏపీ తెలంగాణలో దేవర ఫస్ట్ డే కలెక్షన్స్
దేవర సినిమాకు తెలంగాణ, ఏపీలో రూ. 65 నుంచి 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా అయితే, దేవరకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Fri, 27 Sep 202403:25 AM IST
ఏడుపు ఒక్కటే తక్కువ
దేవర సినిమా టైకింగ్‌పై కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏం తీశావు, కళ్లల్లో నీళ్లు ఒక్కటే తక్కువ అంటూ ఎక్స్‌లో ట్వీట్స్ చేస్తున్నారు.
Fri, 27 Sep 202403:08 AM IST
తండ్రీకొడుకులుగా హ్యాట్రిక్
ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా నటించి డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు అంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. గతంలో ఆంధ్రావాల, శక్తిలతో దేవర సినిమాను పోలుస్తున్నారు. తండ్రీ కొడుకులుగా నటించి ప్లాప్‌లో హ్యాట్రిక్ కొట్టినట్లుగా పోస్టులు వెలువడుతున్నాయి.
Fri, 27 Sep 202402:59 AM IST
రొటీన్ స్టోరీ
దేవర సినిమాకు పాజిటివిటీతోపాటు కాస్తా నెగెటివ్ టాక్ కూడా వస్తోంది. సినిమా చాలా రొటీన్‌గా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Fri, 27 Sep 202402:45 AM IST
దేవరకు 2 వేల కోట్లు
దేవర సినిమా రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ దాటుతుందా అని ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులను ఓ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ అడిగారు. దానికి ఒకరు రెండు వేల కోట్లు కష్టం కానీ, సినిమా అయితే బాగుందని చెప్పారు. అలాగే మరొకరు 2 వేల కోట్లు దాటుతుందని, కల్కి, బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ అవుతుందని చెప్పారు.
Fri, 27 Sep 202402:33 AM IST
దేవర టీమ్‌కు రామ్ చరణ్ విషెస్
ఎన్టీఆర్‌తో పాటు దేవర టీమ్‌కు రామ్‌చరణ్ విషెస్ చెప్పారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలంటూ ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fri, 27 Sep 202402:06 AM IST
రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్...
రాజమౌళితో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాత ఫ్లాప్ ఎదురవుతుందనే సెంటిమెంట్ టాలీవుడ్‌లో ఉంది. దేవరతో ఆ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయ్యిందని కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. కొరటాల శివ రాసిన పూర్ స్క్రిప్ట్ ఇందుకు కారణమని చెబుతోన్నారు.
Fri, 27 Sep 202401:49 AM IST
దేవర థియేటర్లలో అభిమానుల రచ్చ - పోలీసుల ఎంట్రీ
కూకట్‌పల్లి ఏరియాలోని కొన్ని థియేటర్లలో పరిమితులకు మించి అభిమానులు రావడంతో మిడ్‌నైట్ షోలు ఆలస్యంగా మొదలయ్యాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సివచ్చింది.
Fri, 27 Sep 202401:39 AM IST
జాన్వీ ఫ్యాన్స్ డిసపాయింట్
దేవర విషయంలో జాన్వీ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు. ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్ లెంగ్త్ ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల లోపే ఉందని అంటున్నారు. సినిమాలో సెకండాఫ్‌లోనే జాన్వీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. చుట్టమల్లే సాంగ్‌లో ఎన్టీఆర్, జాన్వీకపూర్ కెమిస్ట్రీ బాగుందని పేర్కొంటున్నారు.
Fri, 27 Sep 202401:28 AM IST
హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కోటిలోపే...
తెలుగులో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరగ్గా హిందీ, తమిళ భాషల్లో మాత్రం అంతగా స్పందన లేదు. దేవర హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కోటిలోపే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫస్ట్ డే చాలా థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయని అంటున్నారు.
Fri, 27 Sep 202401:12 AM IST
దేవరలో బాహుబలి ట్విస్ట్ - క్లైమాక్స్‌పై నెటిజన్ల కామెంట్స్
దేవర క్లైమాక్స్ ట్విస్ట్ బాహుబలి వన్ మూవీని పోలి ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడనే పాయింట్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ ట్విస్ట్‌ను కొరటాల రాసుకున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Fri, 27 Sep 202401:04 AM IST
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. దేవర, వర అనే పాత్రల్లో కనిపించాడు. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ యాక్టింగ్, క్యారెక్టర్స్‌లో చూపించిన వేరియేషన్ అద్భుతమంటూ ఫ్యాన్స్ చెబుతోన్నారు.
Fri, 27 Sep 202412:58 AM IST
తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతంటే?
దేవర మూవీ ఫస్ట్ డే వంద కోట్ల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ 26 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఓవర్‌సీస్‌తో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా 42 కోట్లు రాబట్టినట్లు చెబుతోన్నారు.