Jailer OTT Streaming: ఓటీటీలోనూ జైలర్ మూవీ హవా.. ఆ దేశాల్లోనూ ట్రెండింగ్‍లో..-jailer movie in trending on amazon prime ott platform in some countries ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Ott Streaming: ఓటీటీలోనూ జైలర్ మూవీ హవా.. ఆ దేశాల్లోనూ ట్రెండింగ్‍లో..

Jailer OTT Streaming: ఓటీటీలోనూ జైలర్ మూవీ హవా.. ఆ దేశాల్లోనూ ట్రెండింగ్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 09, 2023 05:10 PM IST

Jailer OTT Streaming: ఓటీటీలోనూ జైలర్ చిత్రం హవా చూపిస్తోంది. ఇండియాతో పాటు మరిన్ని దేశాల్లో ట్రెండింగ్‍లో ఉంది. ఆ వివరాలివే..

Jailer OTT Streaming: ఓటీటీలోనూ జైలర్ మూవీ హవా.. మలేషియా, హాంకాంగ్‍ సహా చాలా దేశాల్లో ట్రెండింగ్‍లో..
Jailer OTT Streaming: ఓటీటీలోనూ జైలర్ మూవీ హవా.. మలేషియా, హాంకాంగ్‍ సహా చాలా దేశాల్లో ట్రెండింగ్‍లో..

Jailer OTT Streaming: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‍కు మన భారత్‍లోనే కాకుండా కొన్ని వేరే దేశాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. విదేశాల్లోనూ రజినీ చిత్రాల కోసం చాలా మంది వేచిచూస్తుంటారు. ఆయన హీరోగా నటించిన జైలర్ చిత్రం ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ కాగా.. బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.650కోట్ల కలెక్షన్లకు అతి చేరువలో ఉంది. చాలా ఏళ్ల తర్వాత రజినీ తన రేంజ్ విజయం అందుకున్నారు. జైలర్ ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. కాగా, జైలర్ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఓటీటీలోనూ ఈ చిత్రం హవా చూపిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈనెల 7న జైలర్ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అందరూ అంచనా వేసినట్టే ప్రస్తుతం భారత్‍లో అమెజాన్ ప్రైమ్‍లో జైలర్ మూవీ టాప్ ట్రెండింగ్‍లో కొనసాగుతోంది. అయితే, కొన్ని విదేశాల్లోనూ జైలర్ ట్రెండింగ్‍లో ఉంది.

హాంకాంగ్, మలేషియా, ఖతర్ సహా సుమారు 20 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జైలర్ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఉంది. ఈ విషయంపై ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ కూడా ట్వీట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ జైలర్ ర్యాంపేజ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

జైలర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.643 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఓటీటీలోకి వచ్చినా ఇంకా ఈ చిత్రం థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో జైలర్ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీనే వస్తోంది. తెలుగులోనూ జైలర్ సినిమా రూ.120కోట్ల వరకు వసూలు చేసింది.

జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో క్యామియోలు చేశారు.

జైలర్ సినిమాలో వినాయకన్, వసంత్ రవి, మిర్నా మీనన్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ కీలకపాత్రలు పోషించారు. రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‍గా పవర్‌ఫుల్ రోల్‍లో రజినీకాంత్ స్టైల్, యాక్షన్, స్వాగ్ ఈ చిత్రంలో అదిరిపోయాయి.

Whats_app_banner