Anasuya: నేను ఏం మాట్లాడినా రచ్చ చేస్తున్నారు.. నెటిజన్లపై అనసూయ రియాక్షన్
జబర్దస్త్ ఫేమ్ అనసూయ ట్విటర్ వేదికగా నెటిజన్లను విజ్ఞప్తి చేశారు. తన ట్వీట్లను దయ చేసి రాజకీయ చేయొద్దని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం వరుస పెట్టి ట్వీట్లను తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు.
జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ ఏం చేసినా పెద్ద సంచలనమవుతోంది. ఆమె నోరు విప్పిన ప్రతిసారి నెటిజన్లు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం మరోసారి సామాజిక మాధ్యమాల్లో ఆమె తన ట్వీట్లతో వార్తల్లోకెక్కారు. దీనిపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. తాజాగా నెటిజ్లను కామెంట్లపై స్పందిస్తూ తన వ్యక్తిగత అభిప్రాయాలను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మెరకు శుక్రవారం ఉదయం వరుస ట్వీట్స్ చేశారు.
"ట్విటర్ వేదికగా నేను ఏ పోస్టు పెట్టినా.. అవన్నీ నా అభిరుచి, ఇష్టపూర్వకంగానే, వ్యక్తి, సంస్థ, సిద్ధాంతాన్ని ప్రమోట్ చేయడానికో, డబ్బుల కోసమో, ట్వీట్ చేయడం లేదు. ఏదైనా విషయంపై పూర్తి సమాచారం ఉన్నప్పుడే నేను నోరు విప్పుతున్నాను. అలాగే ఏదైనా విషయంపై మీరు మాట్లాడాలని కోరినా.. దానిపై సరైన అవగాహన లేనప్పుడు నేను మాట్లాడటం మానేస్తున్నా. ఒకవేళ స్పందించినా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల నేను సొంత నిర్ణయానికి రాలేకపోతున్నా. కాబట్టి దయచేసి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దు." అని ట్విటర్ వేదికగా అనసూయ పలు పోస్టుల్లో కోరారు.
అసలేం జరిగిందంటే.. గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సాముహిక అత్యాచారం కేసులో విడుదలైన ముద్దాయిలకు ఓ సంస్థ సన్మానం చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ట్వీట్ చేశారు. "మన దేశానికి ఇదోక మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా!! ఈ రోజు బిల్కిస్ బానో.. రేపు వేరెవరైనా కావొచ్చు. ఇప్పటికైనా నోరు విప్పండి." అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
ఆయన పోస్టుకు అనసూయ రీట్వీట్ చేస్తూ. "ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్లను వదిలేసి.. మహిళల్ని ఇంటికి పరిమితం చేసేలా ఉన్నాం." అని స్పష్టం చేసింది. దీంతో అనసూయ ట్వీట్ నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. హైదరాబాద్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడెలా మాట్లాడుతున్నారు అంటూ కామెంట్లు పెట్టారు. ఈ విధంగా నెటిజన్ల నుంచి వరుసగా ట్వీట్లు రావడంతో అనసూయ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
సంబంధిత కథనం