Fighter: దేశభక్తి సినిమా ఫైటర్‌కు లీగల్ నోటీసులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం.. కారణం ఇదే!-indian air force legal notice to fighter for hrithik deepika liplock scenes in iaf uniform wing commander soumyadeep das ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fighter: దేశభక్తి సినిమా ఫైటర్‌కు లీగల్ నోటీసులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం.. కారణం ఇదే!

Fighter: దేశభక్తి సినిమా ఫైటర్‌కు లీగల్ నోటీసులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం.. కారణం ఇదే!

Sanjiv Kumar HT Telugu

Indian Air Force Legal Notice To Fighter Movie: హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన దేశభక్తి సినిమా ఫైటర్ తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా చిత్రీకరించిందని, ఎంతోమంది అధికారుల త్యాగాలను తక్కువ చేశారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశభక్తి సినిమా ఫైటర్‌కు లీగల్ నోటీసులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆగ్రహం.. కారణం ఇదే!

Legal Notice To Fighter Movie Team: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, గ్లామర్ భామ దీపికా పదుకొణె జంటగా నటించిన దేశభక్తి సినిమా 'ఫైటర్'. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ, తర్వాత నాలుగు రోజులకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విపరీతంగా తగ్గిపోయాయి. ఫైటర్ సినిమా నచ్చకపోవడంపై ఆడియెన్స్‌పై కాంట్రవర్సీయల్ కామెంట్స్ సైతం చేశాడు డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్.

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ నోటీసులు

ఇదిలా ఉంటే తాజాగా ఫైటర్ మూవీ యూనిట్‌కు భారత వైమానిక దళం (Indian Air Force) పెద్ద షాక్ ఇచ్చింది. ఫైటర్ చిత్రంలో ప్రధాన పాత్రధారులైన హృతిక్ రోషన్, దీపికా పదుకొణె మధ్య లిప్ లాక్ సీన్లపై అభ్యంతరం తెలుపుతూ లీగల్ నోటీసులు ఇచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF). భారత వైమానిక దళానికి చెందిన అధికారి వింగ్ కమాండర్ సౌమ్యదీప్ దాస్ (Air Force Officer Soumyadeep Das)ఈ నోటీసు ఇచ్చినట్లు ఇండియా టీవీ నివేదికలు తెలుపుతున్నాయి.

అధికారును కించపరచడమే

హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ నోటీసులు పంపించారు ఐఏఎఫ్ అధికారి వింగ్ కమాండర్ సౌమ్యదీప్ దాస్. ఐఏఎఫ్ యూనిఫాం కేవలం దుస్తులు మాత్రమే కాదని, విధి నిర్వహణ, దేశ భద్రత, నిస్వార్థ సేవ పట్ల అచంచలమైన నిబద్ధతకు బలమైన చిహ్నమని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాంటి ఉన్నతమైన దుస్తులు ధరించి లిప్ కిస్ పెట్టుకోవడం, శృంగారంతో బంధాలను ప్రోత్సహించే సన్నివేశానికి ఉపయోగించడం అంటే వాయుసేన అధికారులను కించపరచడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.

బాధ్యులు ఎవరు

ఇలాంటి అనుచిత చర్యలు ఎయిర్ ఫోర్స్ ఔన్యత్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిపారు. అంతేకాకుండా, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రన్ వేను ఎంతో సున్నిత ప్రాంతంగా పరిగణిస్తారని, ఎంతో భద్రతతో కూడిన రన్ వే మీద లిప్ లాక్ సీన్స్ చేయడం చాలా తప్పు అని అధికారి అన్నారు. ఈ సినిమా చూసి భవిష్యత్‌లో ఎవరైనా అలా చేస్తే దానికి బాధ్యులు ఎవరని కమాండర్ సౌమ్య దీప్ దాస్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఫైటర్‌పై లీగల్ నోటీసులు రావడం హిందీ చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీసింది.

ఫైటర్ గురించి

అయితే లీగల్ నోటీసులపై ఫైటర్ చిత్రబృందం ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే ఫైటర్ మూవీని వార్, పఠాన్ సినిమాల దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఫైటర్ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్రలు పోషించారు. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటీగా హృతిక్ రోషన్, స్క్వాడ్రన్ లీడర్ మినాల్ రాథోడ్ అలియాస్ మిన్నీగా దీపికా పదుకొణె నటించారు. దేశం కోసం పోరాడే గ్రూప్ కెప్టెన్ రాకేశ్ జై సింగ్ అలియాస్ రాకీగా అనిల్ కపూర్ చేశారు.

ఫైటర్ కలెక్షన్స్

ఫైటర్ మూవీకి చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో మొదట్లో కలెక్షన్స్ బాగా వచ్చాయి. అనంతరం తగ్గిన మళ్లీ ఆ కలెక్షన్స్ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఫైటర్ మూవీ ఇండియాలో రూ. 150 కోట్ల క్లబ్‌లో చేరగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్ల మార్క్‌ను దాటింది. కాగా హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన తొలి ఆన్ స్క్రీన్ కాంబినేషన్ ఫైటర్ మూవీ కావడం విశేషం. అయితే ఫైటర్ మూవీని మిడిల్ ఈస్ట్ దేశాలైన అరబ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. ఒక దుబాయ్‌లో మాత్రం ఫైటర్ ప్రదర్శన జరిగింది.