Bigg Boss Telugu 6 Episode 66: సీక్రెట్ రూమ్ భ్రమలో ఆదిరెడ్డి.. శ్రీసత్య కన్నింగ్ గేమ్.. ఇనాయా-ఫైమా ఫిజికల్..!
Bigg Boss Telugu 6 Episode 66: మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ పాము-నిచ్చెన అనే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ఇస్తారు. ఇందులో భాగంగా ఇనాయా, ఫైమా ఇరు జట్లకు సంచాలక్‌గా నియమిస్తారు. అయితే తక్కువ మట్టి ఉన్న కారణంగా ఈ టాస్క్ రెండు రౌండుల్లో కలిపి శ్రీసత్య, రోహిత్, ఇనాయా, వాసంతి కెప్టెన్సీ నుంచి అనర్హులవుతారు.
Bigg Boss Telugu 6 Episode 66: సోమవారం ఎపిసోడ్‌లో వాడి వేడిగా నామినేషన్ల పర్వం సాగింది. మరీ ఎక్కువగా గంటల గంటల పాటు సాగిన ఈ ప్రక్రియతో హౌస్ మేట్స్ చివరకు వచ్చేసరికి అక్కడే కూర్చుండిపోయారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులు తమ నామినేషన్ల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇనాయాపై ఫైమా మరోసారి వెటకారంగా విరుచుకుపడింది. నీ ఫ్యాన్స్ నాకు ఓట్లేసి వెనకకు పంపినా ఫర్వాలేదు.. నాకనిపించేదే చేస్తా అంటూ ఫైమా.. ఇనాయాను ఊడికించింది. మరోపక్క కీర్తి-శ్రీహాన్ మధ్య కోల్డ్ వార్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. శ్రీహాన్‌లో వెటకారం మరీ ఎక్కువవుతుందని, ఇంతలా డ్రామా ఎలా చేస్తాడంటూ వీఐపీ రూంలో కూర్చుని వాసంతి, ఇనాయాతో అంటుంది కీర్తి.
శ్రీసత్యతో సావాసం ఫైమాకే డేంజర్..
ఇనాయా ఇంతలా ఫేక్ చేస్తుందని తాను అనుకోలేదని కిచెన్‌లో ఫైమా.. శ్రీసత్యతో మాట్లాడుతుంది. అయినా తను నా ఫ్రెండే అని, తను మాత్రం అలా చూడట్లేదని ఆమెతో చెబుతుంది. అయితే ఫ్రెండ్ అంటూనే ఇనాయా గురించి నెగిటివ్‌గా చెప్పడం మాత్రం ఫైమాకు ఇంకా బ్యాడ్ చేసేలా ఉంది. అసలే ఇప్పటికే ఓటింగ్ తక్కువ నమోదవుతూ.. డేంజర్ జోన్‌లో ఉంది. మొత్తానికి శ్రీసత్యతో సావాసం ఫైమాకు ప్రమాద ఘంటికలు మోగించేలా ఉంది. అంతేకాకుండా ఇనాయాపై ఊరికే ఊరికే నోరు నోరు పారేసుకోవడం ఆమెకు బాగానే నెగిటివ్ తీసుకొస్తుంది. మరోపక్క ఆదిరెడ్డి గీతూ ఇంకా సీక్రెట్ రూంలోనే ఉన్నాడనే భ్రమలో బతుకుతున్నాడు. గీతూ వెళ్లిపోయిందని అందర్నీ నమ్మించానని, కానీ తాను మాత్రం నమ్మడం లేదని, బిగ్‌బాస్ నువ్వు నన్ను మోసం చేయలేవని ఆయనలో ఆయన మాట్లాడుకోవడం ఆడియెన్స్‌కు నవ్వు తెప్పిస్తుంది.
పాము-నిచ్చెన టాస్క్..
ఇంతలో పదోవారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్‌ను ఇస్తారు బిగ్‌బాస్. ఇందులో భాగంగా బంకమట్టితో నిచ్చెనలు కొంతమంది, పాములను కొంతమంది తయారు చేయాలి. ఇందుకోసం వేర్ హౌస్‌లో బిగ్‌బాస్ సమయానుసారం ఇచ్చే బంకమట్టిని తీసుకోవాల్సి ఉంటుంది. నిచ్చెనల టీమ్ నుంచి ఇనాయాను సంచాలక్‌గా నియమించగా.. పాముల టీమ్ నుంచి ఫైమాను సంచాలక్‌గా నియమిస్తారు. ఇరువురు టీమ్ సభ్యులు బంకమట్టి కోసం తీవ్రంగా ప్రయత్నించి నిచ్చెనలు, పాములను తయారు చేస్తుంటారు. సమయానుసారం ఒక టీమ్ సభ్యుడు.. మరో టీమ్‌లో తనకిష్టమైన సభ్యుడిని ఎంచుకుని వారి నుంచి బంకమట్టిని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీంతో పాముల టీమ్ నుంచి ఫైమా.. కీర్తిని పంపిస్తుంది. కీర్తి.. నిచ్చెనల టీమ్‌ను రాజ్‌ను ఎంచుకుని అతడి నుంచి బంకమట్టిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
అసలే గాయంతో విలవిల్లాడుతున్న కీర్తి విఫలయత్నం చేస్తుంది. రాజ్ లాంటి బలవంతుడిని ఎంచుకోవడమే ఆమె చేసిన తప్పు. అతడి నుంచి ఆమె బంకమట్టిని కాస్త తీసుకోలేకపోతుంది. పైపెచ్చు వేలి గాయం బాధిస్తుండటంతో కన్నీరు పెట్టుకుంటుంది. నొప్పి కంటే ఎక్కువగా దీని కారణంగా ఆడలేకపోతున్నా బిగ్‌బాస్ అంటూ ఎమోషనల్ అవుతుంది. అనంతరం నిచ్చెనల టీమ్ నుంచి శ్రీసత్య బంకమట్టి దొంగతనానికి బయల్దేరుతుంది. పాముల టీమ్ నుంచి వాసంతిని ఎంచుకుంటుంది. ఆమెతో తీవ్రంగా పోరాడిన శ్రీసత్యకు పెద్దగా మట్టి దొరకదు. ఇక్కడ వాసంతి గట్టిగా ఫైట్ ఇచ్చంది. అనంతరం బిగ్‌బాస్ సంచాలక్ అయిన ఇనాయాతో నిచ్చెలన టీమ్‌లో తక్కువ మట్టి ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేయాల్సిందిగా ఆదేశిస్తారు. దీంతో ఆమె ఇనాయా.. శ్రీసత్య మట్టి తక్కువగా ఉందని చెప్పడంతో ఆమె బయటకు వస్తుంది. మరోపక్క పాముల టీమ్ నుంచి ఫైమా.. రోహిత్‌ను ఎంచుకోగా.. అతడు కూడా అనర్హుడవుతాడు.
శ్రీసత్య కన్నింగ్ గేమ్..
అనర్హులైన శ్రీసత్య, రోహిత్‌ను తమకు నచ్చిన వ్యక్తులకు సపోర్ట్ చేసుకోవచ్చని బిగ్‌బాస్ ఆదేశించడంతో.. శ్రీసత్య తను ఉన్న నిచ్చెనల టీమ్‌లో కాకుండా.. పాముల టీమ్‌లో ఉన్న శ్రీహాన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫైమా వద్ద మట్టి తీసుకునేందుకు ఇనాయా వస్తుంటే.. ఆమెకు కూడా సపోర్ట్ చేయడం శ్రీసత్య కన్నింగ్ గేమ్‌ను సూచిస్తుంటే. ఇనాయా-శ్రీసత్య ఒకే టీమ్.. సపోర్ట్ చేయాలంటే ఇనాయాకు చేయాలి కానీ, ఫైమా, శ్రీహాన్‌కు చేయడం గమనార్హం.
ఇంతలో బిగ్‌బాస్.. ఈ టాస్క్ చివరి రౌండ్ మరి కాసేపట్లో ముగుస్తుందని, తమ మట్టిని హౌస్ మేట్స్ భద్రపరచుకోవాలని సూచిస్తాడు. దీంతో ఇనాయా.. ఫైమా-శ్రీహాన్ మట్టి కోసం విఫలయత్నం చేస్తుంది. ఫైమాతో అయితే ఇనాయా దారుణంగా ఫిజికల్ అవుతుంది. ఇద్దరూ కింద పడి పొర్లాడుతూ కొట్టుకుంటారు. ఈ గ్యాప్‌లో మిగిలిన వారు ఇనాయా నిచ్చెన నుంచి మట్టి దొంగిలిస్తారు. రౌండ్ ముగిసే సమయానికి నిచ్చెనల టీమ్ నుంచి తక్కువ మట్టి ఉన్న సభ్యుడిని తొలగించాలని పాముల టీమ్ సంచాలక్ ఫైమాను ఆదేశిస్తాడు బిగ్‌బాస్. దీంతో నిచ్చెన సరిగ్గా లేదని కారణంతో ఫైమా.. ఇనాయాను తొలగిస్తుంది. అనంతరం పాముల్ టీమ్ నుంచి కూడా ఒకరిని తొలగించాలని ఇనాయకు బిగ్‌బాస్ చెబుతారు. అయితే కావాలని తనది, లేదా శ్రీహాన్‌ది తీస్తుందని ఫైమా.. శ్రీసత్యతో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇనాయా మాత్రం నిజాయితీగా వ్యవహరించి తక్కువ మట్టి ఉన్న వాసంతిని తొలగిస్తుంది. దీంతో ఈ టాస్క్ అక్కడితో ముగుస్తుందని బిగ్‌బాస్ చెబుతారు.
సంబంధిత కథనం