Nag Ashwin: ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్-i very curious about salaar sequel says kalki 2898 ad director nag ashwin ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nag Ashwin: ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

Nag Ashwin: ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 16, 2024 07:35 PM IST

Nag Ashwin: తాను ఏ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. కల్కి 2898 ఏడీ సక్సెస్ అయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.

Nag Ashwin: ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్
Nag Ashwin: ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం రూ.1,000కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసి సంచలనాలు సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా ఇంకా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేరే మూవీ ఏదైనా ఉందా అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైంది. దీనికి నాగ్ అశ్విన్ సమాధానం చెప్పారు.

yearly horoscope entry point

సలార్ సీక్వెల్ కోసం..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ పార్ట్-1 చిత్రం గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం క్లైమాక్స్‌లో ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠను మిగిల్చింది. అందుకే సలార్ 2 కోసం చాలా మంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాను కూడా సలార్ సీక్వెల్ కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు.

చాలా సినీ యూనివర్స్‌లు వస్తున్నాయని, వాటిలో ప్రేక్షుకుడిగా ఏ సీక్వెల్‍పై ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారని నాగ్ అశ్విన్‍కు ప్రశ్న ఎదురైంది. తాను కచ్చితంగా సలార్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఆ చిత్రంలోని ఓ కొత్త ప్రపంచం తనకు చాలా ఇంట్రెస్టింగ్‍గా అనిపించిందని అన్నారు.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇష్టం.. అందుకే

సలార్ స్టోరీ ఇప్పుడే మొదలైందని నాగ్ అశ్విన్ చెప్పారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే తనకు ఇష్టమని, సలార్ కూడా అలాగే అనిపిస్తోందనేలా చెప్పారు. అందుకే తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. “నేను సలార్ గురించి చాలా ఆసక్తిగా ఉన్నా. స్టోరీ ఇప్పుడు మొదలైంది. నా హీరో అని కాస్త పక్షపాతం ఉంది. అలాగే నాకు ఆ ఐడియా నచ్చింది. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‍కు పెద్ద ఫ్యాన్. అదో విభిన్నమైన ప్రపంచం.. విభిన్నమైన హౌస్‍లు ఉంటాయి, చరిత్రలు ఉంటాయి. ఆ హౌస్‍ల నుంచి ఎవరో ఒకరు వస్తుంటారు. నాకు కూడా ఈ స్టోరీ (సలార్) అలాగే అనిపిస్తోంది. అందుకే ఆసక్తిగా ఉన్నా” అని నాగ్ అశ్విన్ అన్నారు.

సలార్ పార్ట్-1 క్లైమాక్స్‌లో దేవ (ప్రభాస్) శౌర్యంగ అని రివీల్ అవుతుంది. దీంతో ఆ తర్వాత ఖాన్సార్‌లో ఎలాంటి పోరాటం జరుగుతుందోననే ఆసక్తి విపరీతంగా ఉంది. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం పేరుతో రానుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే క్యూరియాసిటీ నెలకొంది. ఓ దశలో ఈ సీక్వెల్ ఉంటుందా అనే సందేహాలు రాగా.. కచ్చితంగా ఉంటుందనేలా మూవీ టీమ్ సంకేతాలు ఇచ్చింది.

సలార్ చిత్రంలో ప్రభాస్‍తో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. ఖాన్సార్ నగరంపై ఆధిపత్యం కోసం గ్రూప్‍ల మధ్య పోరాటమే ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది. తన మార్క్ యాక్షన్ సీన్లు, ఎలివేషన్లతో సలార్ పార్ట్-1ను తెరకెక్కించి మెప్పించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు చాలా నిరీక్షిస్తున్నారు. మరి సలార్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Whats_app_banner