Yashoda Stunts Video release: సమంతా డెడికేషన్‌కు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఫిదా.. ప్రశంసల వర్షం-hollywood stunt choreographer yanick ben amazed by samantha dedication in yashoda movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yashoda Stunts Video Release: సమంతా డెడికేషన్‌కు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఫిదా.. ప్రశంసల వర్షం

Yashoda Stunts Video release: సమంతా డెడికేషన్‌కు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఫిదా.. ప్రశంసల వర్షం

Maragani Govardhan HT Telugu
Nov 02, 2022 06:24 AM IST

Yashoda Stunts Video release: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన యానిక్ బెన్.. ఆమె అంకితభావానికి ఫిదా అయ్యారు. తాజాగా విడుదల చేసిన యశోద రియలిస్టిక్ వీడియోలో మాట్లాడిన ఆయన.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.

సమంతాతో యానిక్ బెన్
సమంతాతో యానిక్ బెన్

Yashoda Stunts Video release: సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'యశోద' థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. ఈ రోజు యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు.

'యశోద' యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ మాట్లాడుతూ ''నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. యాక్షన్ డైరెక్టర్స్ కోరుకునేది అదే కదా! అందుకని, ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. 'యశోద'లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో.. 'యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్.. 'యశోద' యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి'' అని అన్నారు.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో 'యశోద' ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు 'ఇన్సెప్షన్', 'డంకర్క్'కు కూడా ఆయన వర్క్ చేశారు. 'ట్రాన్స్ పోర్టర్ 3', 'ప్రాజెక్ట్ 7', 'ప్యారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్', 'సిటీ హంటర్' చిత్రాలతో పాటు హిందీలో షారుఖ్ ఖాన్ 'రయీస్', సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై', తెలుగులో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' చిత్రాలకు కూడా యానిక్ బెన్ పని చేశారు.

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలు కూడా ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. సమంతా మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం