Divi| అందాల నిధి.. ఈ దివి.. మత్తెక్కించే కళ్లు.. మతిపోగొట్టే కురులు..!
బిగ్‌బాస్ సీజన్-4లో కనిపించిన దివి తన అందాలతో కుర్రాకారును ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ యువతను తన అందాలతో కట్టిపడేస్తోంది. తాజాగా అదిరిపోయే పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
బిగ్‌బాస్ పుణ్యామా అని ఓవర్‌నైట్‌లో గుర్తింపు తెచ్చున్నవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో దివి కూడా ఒకరు. బిగ్‌బాస్ సీజన్-4లో కనిపించిన ఈ బ్యూటీ తన అందాలతో కుర్రాకారును ఫిదా చేసింది. ఆ సీజన్‌లో ఉన్నది కొన్నివారాలే అయినా ఎక్కువగా ప్రభావితం చేసింది. బయటకు వచ్చిన తర్వాత పలు డ్యాన్స్ వేదికలపై, టీవీ షోలపై కనిపించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ యువతను తన అందాలతో కట్టిపడేస్తోంది. తాజాగా అదిరిపోయే పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
మత్తెక్కించే కళ్లు, స్వేచ్ఛగా విహరించి, అలిసిపోయి మేలిమి ఛాయ ముఖంపై జాలు వారిన కురులు, కనిపించి, కనిపించని ఎద అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది. ఆత్మవిశ్వాసంతో ప్రతీది మంచిగా కనిపిస్తుంది అని ఈ ఫొటోల కింద క్యాప్షన్ పెట్టింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. లవ్ ఎమోజీలతో తమ అభిప్రాయలను వ్యక్తపరుస్తున్నారు.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి దివి క్రేజ్ రోజు రోజుకు అంతకంతకు పెరుగుతోంది. దాదాపు ఆరడగుల ఎత్తు, మంచి ఫిజిక్క్, అందమైన కోలా ముఖాన్ని కలిగి ఉండి తన సౌందర్యంతో యువతకు పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ ఓ మాదిరిగా ఆకట్టుకున్నప్పటికీ దివి పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ చాప కింద నీరులా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా బోల్డ్‌గా కనిపిస్తూ ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకునే విషయంలో వారికంటే ఓ అడుగు ముందే ఉంది. టీవీ షోలు, డ్యాన్స్ షోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా వెండితెరపై కనిపించాలనే కలను నెరవేర్చుకోవడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తూ దర్శక, నిర్మాతల కళ్లల్లో పడాలని ఆశిస్తోంది. దివి తన గ్లామర్‌తో ఇప్పటికే ఘనతలు అందుకుంది. 2020లో మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత కథనం