Malavika Satheesan Interview: 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ మాళవిక సతీషన్ -here full interview of boy friend for hire heroin malavika satheesan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malavika Satheesan Interview: 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ మాళవిక సతీషన్

Malavika Satheesan Interview: 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ మాళవిక సతీషన్

Maragani Govardhan HT Telugu
Oct 08, 2022 06:07 PM IST

Boy Friend for hire Actress Malavika Satheesan: బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది మాళవిక సతీశన్. ఈ సినిమాలో విశేషాలను మీడియాతో పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని స్పష్టం చేసింది.

<p>మాళవిక సతీశన్</p>
మాళవిక సతీశన్ (HT)

Malavika Satheesan Interview: విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ''బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ మాళవిక సతీషన్ విలేఖరుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలని పంచుకున్నారు.

'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' కథలో మీకు నచ్చిన అంశాలు ?

సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం ఉండే సినిమా. ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాలు చూపించే అవకాశం దొరికింది. చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ వుంటుంది.

ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?

ఇందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే పాత్ర ఇది. చాలా బబ్లీగా వుంటుంది. బేసిగ్గా సినిమాలల్లో అమ్మాయి వెనుక అబ్బాయి తిరుగుతాడు. కానీ ఇందులో అమ్మాయే అబ్బాయి వెనుక తిరుగుతుంది. కథలో మంచి ఎమోషనల్ జర్నీ ఉంటుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఉన్న సినిమా ఇది. కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ముందు అనుకున్నట్లే థియేటర్లోనే విడుదల చేస్తున్నాం.

హీరో విశ్వాంత్ గురించి చెప్పండి ?

తను ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ ట్రోవర్ట్. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ లా వుంటుంది. నేను జెర్రీ(నవ్వుతూ).

ఈ కథలో మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ?

నా కవర్ వీడియో సాంగ్ చూసి డైరెక్టర్ సంతోష్ గారు ఆడిషన్స్‌కి పిలిచారు. ఆడిషన్స్ ఇచ్చాను. ఆ పాత్రకు నేను సరిపోతానని ఫైనల్ చేశారు. ఆయనతోనే మరో సినిమా కూడా చేస్తున్నాం.

నిర్మాతల గురించి చెప్పండి ?

వేణు గారు, నిరంజన్ రెడ్డి గారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్స్. వేణు గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు.

చూసి చూడంగానే సినిమా తర్వాత గ్యాప్ రావడానికి కారణం ?

నా చదువు ఇప్పుడే పూర్తయింది. చదువు కారణంగా సినిమాల్లో కొంచెం నెమ్మదిగా ఉన్నా. ఇప్పుడు మూడు సినిమాలు చూస్తున్నా. శివ నాగేశ్వర్ రావు దర్శకత్వంలో దొచేవారెవరురా, అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్‌లో మరో సినిమా చేస్తున్నా.

మీ జర్నీలో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు ?

నా జర్నీ చాలా హాయిగా జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ ఎవరినైనా స్వాగతిస్తుంది. తెలుగులో వున్న గొప్పదనం ఇది.

ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు ?

పాత్రల విషయంలో నాకు ఒక విష్ లిస్టు ఉంది. డిఫెన్స్ ఆఫీసర్‌గా చేయాలని ఉంది. అలాగే మంచి స్పోర్ట్ సినిమా, బయోపిక్ చేయాలని ఉంది. అలాగే రాజమౌళి గారి సినిమాలో చేయాలని ఉంది. అడవి శేష్ నటన నచ్చుతుంది. అలాగే నాగశౌర్య, అఖిల్ అంటే ఇష్టం.

Whats_app_banner

సంబంధిత కథనం