Guppedantha Manasu December 29th Episode: వసును కిడ్నాప్ చేసిన భద్ర -రిషి అడ్రెస్ కనిపెట్టిన రౌడీలు-మహేంద్ర టెన్షన్
Guppedantha Manasu December 29th Episode: రిషిని వెతుక్కుంటూ అతడు దాక్కున్న ప్లేస్‌కు వస్తారు రౌడీలు. తమకు లొంగిపోకపోతే వసుధార ప్రాణం తీస్తామని రిషిని బెదిరిస్తారు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu December 29th Episode: ఎండీ సీట్ కోసం వసుధారను బెదిరిస్తాడు శైలేంద్ర. ఆ విషయం ఫణీంద్రకు తెలుస్తుంది. ఎండీ సీట్ మీద ఆశ లేదని ఓ పేపర్ మీద రాసివ్వమని కొడుకు శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు ఫణీంద్ర. శైలేంద్ర నిజస్వరూపం గురించి ఫణీంద్రకు తెలియడంతో వసుధార కంగారు పడుతుంది. ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని భయపడుతుంది.
రిషి...మహేంద్ర ఎంతో నువ్వు అంతే...
వసుధారకు వెతుక్కుంటూ కాలేజీకి వచ్చిన ఫణీంద్ర... నాకు మహేంద్ర, రిషి ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమని వసుధారతో అంటాడు. వాళ్లపై ఎంత నమ్మకం ఉందో నీపై కూడా అంతే నమ్మకం ఉందని వసుధారకు చెబుతాడు ఫణీంద్ర.
మీరందరూ తొందరపడి ఏ పని చేయరని, ఎవరిని మాటలు అనరని, ఏది చేసినా దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని ఫణీంద్ర అంటాడు. జగతి, రిషి విషయంలో మీరంతా శైలేంద్రను అనుమానించడం వెనుక కారణం ఏమిటో ఎవరూ అడిగిన చెప్పడం లేదు ఎందుకని వసుధారను నిలదీస్తాడు ఫణీంద్ర.
శైలేంద్ర తప్పు చేస్తే...
శైలేంద్ర నిజంగానే తప్పు చేశాడని తెలిస్తే నేను వదిలిపెట్టనని ఫణీంద్ర కోపంగా చెబుతాడు. శైలేంద్రకు ఎండీ సీట్ మీద ఆశ ఉన్నట్లు ఫోన్ నువ్వు మాట్లాడావు. ఇదే విషయం వాడిని అడిగితే ఎండీ సీట్‌పై నాకు ఎలాంటి ఆశ లేదని లెటర్‌పై రాసి ఇచ్చాడని పేపర్‌ను వసుధారకు ఇస్తాడు ఫణీంద్ర. శైలేంద్ర నీకు ఏ విధంగా అడ్డురాడని, ధైర్యంగా ఉండమని, ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నానని వసుధారకు మాటిస్తాడు ఫణీంద్ర. పెద మామయ్య మాటలతో వసుధార ఎమోషనల్ అవుతుంది.
మహేంద్ర షాక్...
రిషి గురించి ఆలోచిస్తూ మహేంద్ర బాధలో మునిగిపోతాడు. మార్చురీలో కనిపించిన డెడ్‌బాడీ రిషిదేనని చాలా భయపడిపోయానని, ఆ క్షణంలో నా గుండె ఆగిపోయినంత పనైందని అనుపమతో చెబుతాడు మహేంద్ర.
రిషి ఖచ్చితంగా వస్తాడని, ఆ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోవద్దని మహేంద్రను ఓదార్చుతుంది అనుపమ. అప్పుడే వారి దగ్గరకు వసుధార వస్తుంది. ఫణీంద్ర ఇచ్చిన లెటర్‌ను మహేంద్రకు చూపిస్తుంది.
శైలేంద్ర ఎండీ సీట్ కోసం ఆశపడుతున్న సంగతి అన్నయ్య ఫణీంద్రకు ఎలా తెలిసిందా? అని మహేంద్ర షాకవుతాడు. తన వల్ల శైలేంద్ర నిజస్వరూపం ఫణీంద్రకు తెలిసిందని వసుధార అసలు నిజం చెబుతుంది. ఎండీ సీట్ కావాలా...రిషి కావాలా అని కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని, అదే శైలేంద్రనే చేశాడనుకొని అతడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాలని అనుకున్నానని వసుధార చెబుతుంది.
అయితే ఆ ఫోన్ ఫణీంద్ర లిఫ్ట్ చేసి తన మాటలు మొత్తం విన్నాడని, అందుకే శైలేంద్రకు ఎండీ సీట్‌పై ఆశ లేదని లెటర్ తీసుకొచ్చాడని చెబుతుంది.
శైలేంద్ర వేసే ప్రతి అడుగు...
శైలేంద్రకు వ్యతిరేకతంగా మన దగ్గర సాక్ష్యం ఉన్నా ఇంకా బెదిరింపులకు దిగుతున్నాడంటే వాడి మళ్లీ ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నట్లుగా ఉందని మహేంద్ర భయపడతాడు. రిషిని కాపాడుకోవడమే మనకు ముఖ్యమంటూ చెబుతాడు. తన నటనతో తండ్రిని కూడా నమ్మించేతా మూర్ఖుడు శైలేంద్ర అని...కన్న తండ్రి కళ్లకు కూడా గంతలు కట్టగలడని మహేంద్ర అంటాడు.
ఫణీంద్రలో ఎంత నిజాయితీ ఉన్నా కొడుకు అనే మామకారం శైలేంద్రను కాపాడగలడని అనుమానపడతాడు. శైలేంద్ర వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిద్ధాం...ఏదో ఒక చోట తప్పు చేసి దొరికిపోతాడు. దాని ఆధారంగానే రిషి ఎక్కడున్నాడో కనిపెడదామని మహేంద్ర, వసుధారలతో అంటుంది అనుపమ. రిషి వస్తేనే శైలేంద్రకు తగిన బుద్దిచెబుతాడని మహేంద్ర ఫిక్సవుతాడు.
రిషి సేఫ్...
గాయాల నుంచి కోలుకున్న రిషి కళ్లు తెరుస్తాడు. ఒళ్లంతా దెబ్బలతో చెట్ల పొదల్లో పడిఉన్న నిన్ను మేమే మా ఇంటికి తీసుకొచ్చామని, మాకు తెలిసిన పసరు వైద్యం చేశామని రిషికి ట్రీట్‌మెంట్ ఇచ్చిన వృద్ధ దంపతులు చెబుతారు.
అసలు నువ్వు ఎవరు? నిన్ను కొట్టింది ఎవరు? వసుధార అనే పేరు పదే పదే కలవరిస్తున్నావు...అసలు ఆ పోరి ఎవరని రిషిని అడుగుతారు. కానీ రిషి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. మిమ్మల్ని నా దగ్గరకు ఆ దేవుడే పంపించాడు. మీరే నాకు పునర్జన్మను ఇచ్చారు. నాకు ప్రాణం పోశారని రిషి వారికి చేతులు జోడించి దండం పెడతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు.
రిషి కోసం రౌడీలు...
వసుధార నువ్వు నా కోసం ఎంత ఎదురుచూస్తున్నావో తెలుసు. మళ్లీ మనిద్దరం కలవడం కోసమే అమ్మ జగతి వీళ్లిద్దరని నా దగ్గరకు పంపించిందని రిషి మనసులో అనుకుంటాడు. మనం మళ్లీ కలుస్తాం వసుధార అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంటాడు. అప్పుడే ఇద్దరు రౌడీలు రిషి కోసం వెతుకుతూ ఆ వృద్ధ దంపతుల ఇంటివైపు వస్తారు.
ఆ రౌడీలను పట్టుకొని తన కోసం ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు.కానీ ఇంకా నువ్వు పూర్తిగా కోలుకోలేదని, వారితో పోరాడే శక్తి లేదని రిషితో అంటాడు పెద్దయ్. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడితేనే రేపు వారిపై గెలవగలవని రిషికిసలహా ఇస్తాడు. నీకు ఏదైనా జరిగితే మీ వాళ్లు జీవితం బాధపడతావని రిషితో అంటాడు పెద్దయ్య. అతడి మాటలకు రిషి కన్వీన్స్ అవుతాడు. రౌడీలకు కనిపించకుండా రిషిని ఇంట్లోనే దాచిపెడతాడు పెద్దయ్య.
దాక్కున్న రిషి...
తామిద్దరం తప్ప ఇంట్లో ఎవరూ లేరని పెద్దయ్య ఎంత చెప్పిన వినకుండా రిషిని వెతుక్కుంటూ ఇంట్లోకి వస్తారు రౌడీలు. ఇళ్లు మొత్తం వెతుకుంటారు. రిషిని దాచిపెట్టిన రూమ్‌లోకి రౌడీ వస్తుండగానే అప్పుడే అతడికి ఫోన్ వస్తుంది. దాంతో రూమ్ చూడకుండా వెళ్లిపోవడంతో రిషి రిలీఫ్‌గా ఫీలవుతాడు. ఆ రౌడీల బారి నుంచి రిషి బయటపడటం చూసి వృద్ధ దంపతులు ఆనందపడతారు.
భద్ర స్కెచ్...
వసుధారను చంపేందుకు భద్ర స్కెచ్ వేస్తాడు. అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉండగా వసుధారను చంపాలని ఫిక్స్ అవుతాడు. వసుధార రూమ్‌లోకి వస్తాడు. ఖర్చీఫ్‌పై మత్తు మందు స్ప్రే చేసి వసుధారను కిడ్నాప్ చేస్తాడు.
రిషికి వార్నింగ్...
వసుధార ను తీసుకొని వృద్ధ దంపతుల ఇంటికి వస్తారు రౌడీలు. రిషి నువ్వు లోపల దక్కున్నావని మాకు తెలుసు. మర్యాదగా మాకు లొంగిపో లేదంటే వసుధార ప్రాణం తీస్తామని బెదిరిస్తారు. వసుధార మెడపై కత్తి పెడతారు. వసుధార ప్రాణం కాపడటానికైనా తాను రౌడీలతో పోరాడాలని రిషి ఫిక్సవుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.