Gunde Ninda Gudi Gantalu: పని దొంగగా బాలుపై ముద్ర - రవిని క్షమించిన ప్రభావతి - రోహిణికి దొరికిపోయిన మీనా
Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంటలు డిసెంబర్ 3 ఎపిసోడ్‌లో బాలు తరఫున ఫైనాన్షియర్‌కు క్షమాపణలు చెప్పడానికి అతడి ఆఫీస్‌కు వస్తుంది మీనా. ఆమెకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వెయిట్ చేయిస్తాడు ఫైనాన్షియర్. మరోవైపు ఇంట్లో వాళ్లకు తెలియకుండా రవిని రహస్యంగా కలుస్తుంది ప్రభావతి.
బాలు కష్టం చూడలేక ఫైనాన్షియర్‌కు క్షమాపణలు చెప్పడానికి వస్తుంది మీనా. కానీ ఫైనాన్షియర్ మాత్రం మీనాను ఆఫీస్ రూమ్ లోపలికి పంపించవద్దని తన మనుషులతో చెబుతాడు. పైనాన్షియర్‌తో మాట్లాడే వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లనని పట్టుపడుతుంది మీనా. బాలుకు పొగరు ఎక్కువైతే..మీనాకు పట్టుదల ఎక్కువ. ఎంత సేపు ఉంటుందో ఉండనీయ్ అని ఫైనాన్షియర్ అంటాడు.
రవిని కలిసిన మీనాక్షి...
మరోవైపు రవిని చాటుగా కలవాలని కామాక్షితో కలిసి వస్తుంది ప్రభావతి. తాను చెప్పిన చోటుకు రవి వస్తాడో రాడో అని కంగారుగా ఎదురుచూస్తుంటుంది. రవిని కలిసిన విషయం బాలుకు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకొని భయపడిపోతుంది. అప్పుడే రవి అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. రవిని చూడగానే ఎమోషనల్ అవుతుంది ప్రభావతి.
నీ మనసును కష్టపెట్టా...
నీ పెళ్లి వల్ల చాలా సమస్యలు వచ్చాయని, అన్నింటికి కారణం నువ్వేనని నీ మనసును కష్టపెట్టానని కొడుకుతో అంటుంది ప్రభావతి. హాస్పిటల్‌కు వస్తే నిన్ను గెంటేసినందుకు నాపై నీకు కోపంగా ఉందా అని రవిని అడుగుతుంది ప్రభావతి. అమ్మ ఎప్పటికీ అమ్మే అని రుజువుచేశావు..నీకు నా మీద ప్రేమ అలాగే ఉండటం ఆనందంగా ఉందని రవి బదులిస్తాడు.
నిజం బయటపెట్టిన కామాక్షి...
ఎవరికి తెలియకుండా నన్ను ఎందుకు కలవాలని అనుకున్నావని తల్లిని అడుగుతాడు రవి. డబ్బు కోసమే రవి, శ్రుతిలను తిరిగి ఇంటికి రప్పించాలనుకున్నప్లాన్‌ను అనుకోకుండా బయటపెట్టేస్తుంది కామాక్షి. ఆ తర్వాత తడబడి మాట మార్చేస్తుంది. కామాక్షి మాటలను ప్రభావతి అడ్డుకుంటుంది.
చెట్టుకు కాయం భారం కానట్లు..ప్రతి తల్లికి బిడ్డలు బరువు కాదని, తిరిగి ఇంటికి వచ్చేయమని రవితో అంటుంది ప్రభావతి. నాకు రావాలనే ఉంది...నాన్నను చూడాలని ప్రాణం తహతహలాడుతుందని రవి అంటాడు. తొందరలోనే మనం ఒక్కటయ్యే రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నానని ప్రభావతి అంటుంది.
జన్మలో జరగదు...
అది జన్మలో జరుగుతుందని అనుకోవడం లేదని, బాలు నన్ను చూస్తేనే కోపంతో రగిలిపోతున్నాడని రవి అంటాడు. తిరిగి ఇంటికి రావాలంటే ఏం చేయాలో తెలియడం లేదని బాధపడతాడు.
నీకు ఇంటికి రావాలని ఉంటే మీ అమ్మ చరిత్ర తిరగేసి రాస్తుందని, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని రవికి అభయమిస్తుంది కామాక్షి.
లక్షలు మింగిన మనోజ్‌నే...
నామీద నీకు కోపం పోయిందా అని తల్లిని అడుగుతాడు ప్రభావతి.లక్షలు మింగిన మనోజ్‌ను మీ అమ్మ ఏమని అనలేదని, నీపై మీ అమ్మకు కోపం ఎలా ఉంటుందని కామాక్షి సర్ధిచెబుతుంది. నువ్వు చేసిన పనికి కోపంగా ఉన్నా...కన్న కొడుకును దూరం చేసుకునే కఠినాత్మురాలిని కాదని ప్రభావతి అంటుంది.
మీ ప్రేమ విషయం ముందు నాకు చెప్పకుండా మీనాకు చెప్పి తప్పుచేశావని ప్రభావతి అంటుంది. మా పెళ్లి గురించి వదినకు చెప్పకుండా నేనే గుడికి తీసుకెళ్లానని వదినను వెనకేసుకొస్తాడు రవి. బాలును సంగతి నేను చూసుకుంటా...నువ్వు భార్యతో కలిసి ఇంటికి వచ్చేయమని రవితో అంటుంది ప్రభావతి.
పని పూర్తయిన తర్వాతే...
మధ్యాహ్నం రెండు గంటల వరకు బాలు ఆగకుండా పనిచేస్తాడు. లంచ్ చేయడానికి బయలుదేరుతాడు. కానీ అపార్ట్‌మెంట్ మేనేజర్ మాత్రం పని మధ్యలో వదిలేసి భోజనం చేయడానికి వెళతానంటే కుదరదని అంటాడు. పని పూర్తయిన తర్వాతే భోజనం అయినా ఏదైనానని చెబుతాడు. పని మధ్యలో మానేసి వెళ్లిన వాళ్లను పని దొంగ అని అంటారని బాలును అపార్ట్‌మెంట్ మేనేజర్ అవమానిస్తాడు.
ఫైనాన్షియర్‌ను బతిమిలాడిన బాలు...
పైనాన్షియర్ కోసం చాలా సమయం నుంచి వెయిట్ చేస్తుంటుంది మీనా. మధ్యాహ్నం దాటినా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో కంగారు పడుతుంది. . మావయ్యకు ఆరోగ్యం బాగాలేదని, ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్నారని, పైనాన్షియర్‌ను ఒక్కసారి కలిసి వెంటనే వెళ్లిపోతానని పైనాన్షియర్ మనుషులను బతిమిలాడుతుంది మీనా. కానీ వాళ్లు మాత్రం వెయిట్ చేయాల్సిందేనని చెబుతారు.
మావయ్యకు ఫోన్ చేసి భోజనం చేయమని, మందులు వేసుకోవడం మర్చిపోవద్దని ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతుంది.
బాలు మంచివాడు...
అప్పుడే ఫైనాన్షియర్ బయటకు వస్తాడు. బాలు చాలా మంచివాడని, తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంలో కోపంలో మాటలు జారాడని ఫైనాన్షియర్‌తో మీనా అంటుంది. మీ కారు మాకు ఆధారమని మీనా అంటుంది. ఇలా ఆధారపడి బతికేవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి. కోపం కంట్రోల్ చేసుకోవాలని ఫైనాన్షియర్ అంటాడు. సాయం చేసిన వాళ్ల చేతులు విరిచేస్తానంటే ఫలితం ఇలాగే ఉంటుందని, తాగుబోతు వెధవ అంటూ బాలును అవమానిస్తాడు ఫైనాన్షియర్. తన భర్త వ్యక్తిత్వంపై నిందలు వేయద్దని ఫైనాన్షియర్‌తో అంటుంది మీనా. నీ భర్త మంచివాడంటూ చాటింపు చేస్తూ ఊరేగు అని ఫైనాన్షియర్ వెళ్లిపోతాడు. మీనా ఎంత బతిమిలాడిన వినడు.
సాంబార్‌లో బల్లి...
ఇంట్లో సత్యం ఒక్కడే భోజనం చేయడం చూసి అందరూ ఎక్కడికి వెళ్లారని అడుగుతాడు బాలు. మీనా పూల మాలలు కట్టడానికి వెళ్లిందని, అమ్మ బయట పనుందని వెళ్లిందని అంటాడు. సత్యం నోట్లో ముద్ధ పెట్టుకుంటుండగా బాలు అడ్డుకుంటాడు. సాంబర్‌లో బల్లి పడిందని ఆపేస్తాడు.
ప్రభావతి, మీనా వచ్చిరావడంతోనే ఇద్దరిపై ఫైర్ అవుతాడు. సాంబార్‌లో బల్లి పడిన సంగతి చెబుతాడు. సాంబార్‌తో పాటు వంట చేసింది మీనానే...దీనికి అంతటికి కారణం నీ పెళ్లామే అని ప్రభావతి అంటుంది.సాంబర్‌లో ఏం వేశావని మీనాను కోప్పడుతాడు బాలు.
బాలు తరఫున క్షమాపణలు..
ఫైనాన్షియర్ ఇంటికి వస్తుంది మీనా. బాలు తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని, కారును తిరిగి ఇవ్వమని బతిమిలాడుతుంది. ఫైనాన్షియర్ భార్యకు మేకప్ చేయడానికి రోహిణి వస్తుంది. బాలు కారును ఫైనాన్షియర్ తీసుకెళ్లిపోయాడనే నిజం ఆమెకు తెలిసిపోతుంది. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.