Gopichand - Srinu Vaitla: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్.. గోపీచంద్‍తో నయా మూవీ-gopichand srinu vaitla new movie launched ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gopichand - Srinu Vaitla: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్.. గోపీచంద్‍తో నయా మూవీ

Gopichand - Srinu Vaitla: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్.. గోపీచంద్‍తో నయా మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 09, 2023 03:31 PM IST

Gopichand - Srinu Vaitla: శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపిచంద్ కొత్త మూవీ మొదలైంది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మూవీ చేస్తున్నారు శ్రీను వైట్ల.

Gopichand - Srinu Vaitla: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్.. గోపీచంద్‍తో నయా మూవీ
Gopichand - Srinu Vaitla: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్.. గోపీచంద్‍తో నయా మూవీ

Gopichand - Srinu Vaitla: కామెడీ యాక్షన్ చిత్రాలతో బ్లాక్‍బాస్టర్లు అందుకొని ఓ దశలో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరారు శ్రీను వైట్ల. అయితే, కొన్నేళ్లుగా వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. దూకుడు బంపర్ హిట్ అయిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఏ చిత్రం కూడా పెద్దగా విజయం సాధించలేదు. దీంతో అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు శ్రీను వైట్ల. మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఆ వివరాలివే..

గోపిచంద్ - శ్రీను వైట్ల సినిమా (Gopichand 32) పూజా కార్యక్రమం నేడు (సెప్టెంబర్ 9) జరిగింది. చిత్రాలయం స్టూడియో పతాకంపై వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. గోపిచంద్‍కు ఇది 32వ సినిమాగా ఉంది.

గోపిచంద్ ప్రస్తుతం భీమా చిత్రం చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక.. శ్రీను వైట్లతో ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. గోపిచంద్ హీరోగా నటించిన రామబాణం ఈ ఏడాది రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

శ్రీనువైట్ల చివరగా 2018లో అమర్ అక్బర్ అంటోనీ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన ఆ చిత్రం ప్లాఫ్‍గా నిలిచింది. దీంతో విరామం తీసుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు గోపిచంద్‍తో మూవీకి రెడీ అయ్యారు. ఈ చిత్రం ఆయనతో పాటు గోపిచంద్‍కు కూడా కీలకంగా ఉంది.

Whats_app_banner