Gaami OTT release date: గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?-gaami ott release date vishwak sen movie to stream in zee5 ott from april 12th says some reports ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaami Ott Release Date: గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?

Gaami OTT release date: గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?

Hari Prasad S HT Telugu
Apr 02, 2024 10:06 AM IST

Gaami OTT release date: విశ్వక్ సేన్ నటించిన గామి మూవీ ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం కానుంది. ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కు రావచ్చని భావిస్తున్నారు.

గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?
గామి ఓటీటీ రిలీజ్ మరో వారం ఆలస్యం.. హనుమాన్‌లాగే అవుతుందా?

Gaami OTT release date: విశ్వక్ సేన్ నటించిన మూవీ గామి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే నిజానికి ఈ వారమే గామి డిజిటల్ ప్రీమియర్ ఉంటుందని మొదట భావించారు. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఇప్పుడీ మూవీ మరో వారం ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గామి ఓటీటీ రిలీజ్

గత నెల 8వ తేదీని థియేటర్లలోకి వచ్చిన గామి మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ పై సోషల్ మీడియాలో పుకార్లు తప్ప ఇప్పటి వరకూ ఆ ఓటీటీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఈమధ్య కాలంలో ఈ ఓటీటీ సొంతం చేసుకున్న సినిమాలు ఊహించిన సమయం కంటే ఆలస్యంగా రావడం అభిమానులను అసహనానికి గురి చేస్తున్నాయి.

ఈ మధ్యే హనుమాన్ విషయంలోనూ అదే జరిగింది. ఇక ఇప్పుడు గామి కూడా ఏప్రిల్ 5న వస్తుందని ముందుగా భావించినా.. ఇప్పుడు ఏప్రిల్ 12న రానున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. విశ్వక్ ఓ డిఫరెంట్ రోల్లో కనిపించిన ఈ సినిమాకు తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధించింది.

గామి మూవీ ఎలా ఉందంటే?

విశ్వక్ సేన్ తన కెరీర్లో చాలా వరకూ లవ్, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ స్టోరీల్లోనే ఎక్కువగా నటించాడు. ఒక్క హిట్ మూవీలో మాత్రం కాస్త డిఫరెంట్ రోల్ ప్లే చేశాడు. అయితే తాజాగా వచ్చిన గామిలో మాత్రం అతనిది పూర్తి భిన్నమైన పాత్ర. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అతడు ఓ అఘోరా పాత్రలో కనిపించాడు. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ.

మూడు క‌థ‌లను క‌లుపుతూ సాగే గ‌మ్మ‌త్తైన సినిమా ఇది. స్క్రీన్‌ప్లే, విజువ‌ల్స్, వీఎఫ్ఎక్స్‌తో మ్యాజిక్ చేయాల‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్‌. మూడు క‌థ‌ల‌ను క‌లుపుతూ వ‌చ్చే ట్విస్ట్ స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. కాన్సెప్ట్ బాగున్నా దానిని అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిన‌ట్లు అనిపిస్తుంది. మూడు క‌థ‌ల‌కు ఉన్న సంబంధాన్ని క‌న్వీన్సింగ్‌గా చెప్ప‌లేక‌పోయారు. చాలా చోట్ల సినిమాటిక్ లిబ‌ర్టీని తీసుకొని త‌న‌కు క‌న్వీనెంట్‌గా క‌థ‌ను రాసుకున్నాడు.

గామి ఓ భిన్న‌మైన ప్ర‌య‌త్నంగా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. ప్ర‌యోగాత్మ‌క సినిమాలు తెలుగులో రావ‌డం లేద‌నే లోటును గామి కొంత వ‌ర‌కు తీర్చింది. శంక‌ర్ అనే అఘోరా పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ జీవించాడు. పాత్ర కోసం అత‌డు ప‌డిన క‌ష్టం స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. అత‌డి లుక్‌, బాడీలాంగ్వేజ్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపిస్తుంది. అభిన‌య‌, అబ్దుల్ స‌మద్‌ల న‌ట‌న బాగుంది.

గామి మూవీ తొలి మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినా.. తర్వాత క్రమంగా తగ్గుతూ వెళ్లాయి. ఈ సినిమాకు గోపీచంద్ భీమా నుంచి కూడా పోటీ ఎదురైంది. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై కొంత మేర కనిపించింది.

Whats_app_banner