God of Masses Balayya: మాస్ జాతర అంటే ఇది.. బాలయ్య ఫొటోకు మద్యంతో అభిషేకం.. ఇంతకంటే పీక్స్ ఉంటుందా?-fans anointing balakrishna photo with alcohol video goes to viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  God Of Masses Balayya: మాస్ జాతర అంటే ఇది.. బాలయ్య ఫొటోకు మద్యంతో అభిషేకం.. ఇంతకంటే పీక్స్ ఉంటుందా?

God of Masses Balayya: మాస్ జాతర అంటే ఇది.. బాలయ్య ఫొటోకు మద్యంతో అభిషేకం.. ఇంతకంటే పీక్స్ ఉంటుందా?

Maragani Govardhan HT Telugu
Jan 16, 2023 11:45 AM IST

God of Masses Balayya: నందమూరి బాలకృష్ణపై ఓ అభిమాని వినూత్నంగా అభిమానం చూపించారు. ఆయన ఫొటోకు మద్యంతో అభిషేకం చేస్తూ జై బాలయ్య అంటూ నినాదాలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలయ్య వీరసింహారెడ్డి
బాలయ్య వీరసింహారెడ్డి

God of Masses Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు ఈ సినిమా తెగనచ్చేసింది. అందుకే అదిరిపోయే వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే రూ.50 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా వంద కోట్ల దిశగూ ప్రయాణిస్తోంది. ఇదిలా ఉంటే వీరసింహారెడ్డికి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బాలయ్య ఫొటోకు మద్యంతో అభిషేక్ చేస్తున్నట్లు ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

సాధారణంగా హీరోలెవరైనా మాస్ ప్రేక్షకుల అభిమానం కోసం తెగ పరితపిస్తుంటారు. అందులోనూ స్టార్ హీరోలైతే మాస్ ఐడెంటిటీ కోసం ప్రత్యేకంగా ఆ తరహా చిత్రాలు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ శైలే వేరు. ఆయనకు మొదట నుంచి మాస్ గుర్తింపు ఉండటంతో అభిమానులు గాడ్ ఆఫ్ మాస్‌గా పిలుచుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో పలువురు హీరోల అభిమానుల తమ కథానాయుకుడు కూడా మాస్ హీరోనే అంటూ నెట్టింట కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమా విడుదలైతే చాలు.. మూవీ ఎలా ఉన్నా మాస్ జాతర అంటూ హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

అయితే వీరసింహారెడ్డి విషయంలో మాత్రం అసలైన మాస్ జాతర ఏంటో చూపించారు బాలయ్య అభిమాని ఒకరు. బాలకృష్ణ ఫొటోకు మద్యంతో అభిషేకం చేస్తూ తన అభిమానాన్ని వైవిధ్యంగా చూపించారు. అందులోనూ ఆయన ఫేవరెట్ ఆల్కహాల్ బ్రాండ్ అయిన మ్యాన్షన్ హౌస్‌తో అభిషేకం చేస్తూ అభిమానాన్ని పీక్స్‌లో చూపించారు. అసలే మందు బాబులు.. మద్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మనకు తెలిసిందే. చివరి చుక్కను సైతం లక్కీ డ్రాప్‌గా భావించి గొంతును తడుపుకునే ఈ రోజుల్లో ఏకంగా బాలయ్య ఫొటోకు మద్యాన్ని అభిషేకంగా చల్లారు. జై బాలయ్య అంటూ నినదిస్తూ తమ అభిమాన హీరోపై ప్రేమను కురిపించారు. అసలైన మాస్ జాతర అంటే ఇది అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

వీరసింహారెడ్డి చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన తమన్ తాజాగా ఈ వీడియోపై స్పందించారు. పీక్స్ అమ్మా.. అంటూ వీడియోను షేర్ చేశారు. ఫలితంగా వీడియో మరింత మందిని చేరువైంది. గాడ్ ఆఫ్ మాస్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం