O Saathiya Movie Breakup Song: క్రిష్ రిలీజ్ చేసిన ఓ సాథియా మూవీ బ్రేక‌ప్ సాంగ్-director krish launched o saathiya movie breakup song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  O Saathiya Movie Breakup Song: క్రిష్ రిలీజ్ చేసిన ఓ సాథియా మూవీ బ్రేక‌ప్ సాంగ్

O Saathiya Movie Breakup Song: క్రిష్ రిలీజ్ చేసిన ఓ సాథియా మూవీ బ్రేక‌ప్ సాంగ్

Nelki Naresh Kumar HT Telugu
Feb 15, 2023 12:49 PM IST

O Saathiya Movie Breakup Song: ఓ సాథియా సినిమాలోని బ్రేక‌ప్ సాంగ్‌ను ప్రేమికుల రోజు సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ క్రిష్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ఆర్య‌న్ గౌర‌, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

డైరెక్ట‌ర్ క్రిష్, ఆర్య‌న్ గౌర‌, దివ్య భావ‌న‌
డైరెక్ట‌ర్ క్రిష్, ఆర్య‌న్ గౌర‌, దివ్య భావ‌న‌

O Saathiya Movie Breakup Song: ఆర్య‌న్ గౌర‌, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి జంట‌గా న‌టిస్తోన్న ఓ సాథియా సినిమాలోని బ్రేక‌ప్ సాంగ్‌ను వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్ రిలీజ్ చేశాడు. వెళ్లిపోయే అనే అంటూ మెలోడీ ప్ర‌ధానంగా సాగే ఈ పాట‌ను రాహుల్ సింప్లిగంజ్ ఆల‌పించాడు. వినోద్ కుమార్ మ్యూజిక్ అందించగా బాబా భాస్క‌ర్ కొరియోగ్ర‌ఫీ సమకూర్చాడు. భాస్క‌రబ‌ట్ల ఈ పాట‌ను రాశాడు.

పాట‌ను రిలీజ్ చేసిన క్రిష్ చ‌క్క‌టి సాహిత్య‌పు విలువ‌ల‌తో బాగుంద‌ని ప్ర‌శంసించారు సోష‌ల్ మీడియాలో క్రిష్ రిలీజ్ చేసిన ఈ బ్రేక‌ప్ సాంగ్‌కు చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఓ సాథియా సినిమాకు దివ్య భావ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. చంద‌న క‌ట్టా నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లిద్ద‌రూ మ‌హిళ‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందిస్తోన్నారు. జీ జాంబీ త‌ర్వాత అర్య‌న్ గౌర హీరోగా న‌టిస్తోన్న సినిమా ఇది. మిస్తి చ‌క్ర‌వ‌ర్తి గ‌తంలో చిన్న‌దాన నీకోసం, కొలంబ‌స్‌తో పాటు ప‌లు సినిమాలు చేసింది. ఓ సాథియా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌ల విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని, అతి త్వ‌ర‌లో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

IPL_Entry_Point

టాపిక్