Rajinikanth Lal Salaam: క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో ర‌జ‌నీకాంత్ సినిమా నుంచి త‌ప్పుకున్న నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌-costume designer poornima ramaswamy walked out from rajinikanth lal salaam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Costume Designer Poornima Ramaswamy Walked Out From Rajinikanth Lal Salaam Movie

Rajinikanth Lal Salaam: క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో ర‌జ‌నీకాంత్ సినిమా నుంచి త‌ప్పుకున్న నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2023 06:57 PM IST

Rajinikanth Lal Salaam: షూటింగ్ మొద‌లుకాక‌ముందే ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ సినిమా నుంచి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో కాస్ట్యూమ్ డిజైన‌ర్ త‌ప్పుకోవ‌డం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్‌
ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్‌

Rajinikanth Lal Salaam: క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో షూటింగ్ మొద‌లుకాక‌ముందే ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ సినిమా నుంచి కాస్ట్యూమ్ డిజైన‌ర్ త‌ప్పుకోవ‌డం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. లాల్ స‌లామ్ సినిమాకు ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది.

అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్నారు.స్పోర్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న లాల్ స‌లామ్ సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లే ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. షూటింగ్ మొద‌లుకాక‌ముందే లాల్ స‌లామ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు కాస్ట్యూమ్ డిజైన‌ర్ పూర్ణిమ రామ‌స్వామి ట్వీట్ చేసింది.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో త‌లెత్తిన కొన్నిఇబ్బందుల‌ వ‌ల్ల ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు పూర్ణిమ ట్వీట్‌లో పేర్కొన్న‌ది. సినిమా పోస్ట‌ర్స్ నుంచి త‌న పేరును తొల‌గించాల్సిందిగా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ను కోరింది. ఆమె ట్వీట్ త‌మిళ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌తో త‌లెత్తిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తోనే పూర్ణిమ లాల్ స‌లామ్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సూరారై పొట్రుతో పాటు ప‌లు త‌మిళ‌ సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా పూర్ణిమ రామ‌స్వామి ప‌నిచేసింది.

బాలా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప‌ర‌దశి సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా జాతీయ అవార్డు అందుకున్న‌ది. కాగా లాల్ స‌లామ్ సినిమాతో దాదాపు ఆరేళ్ల విరామం త‌ర్వాత మెగాఫోన్ ప‌డుతోంది ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌. గతంలో ధ‌నుష్‌తో త్రీతో పాటు వాయ్ రాజా వాయ్‌, సినిమా వీర‌న్‌ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌.

IPL_Entry_Point

టాపిక్