Brahmastra OTT Release Date: బ్రహ్మాస్త్ర ఓటీటీలోకి వచ్చేస్తోంది - రిలీజ్ డేట్ ఇదే
Brahmastra OTT Release Date: రణ్‌భీర్‌కపూర్, అలియాభట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే...
Brahmastra OTT Release Date: బ్రహ్మాస్త్ర ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయబోతున్నది. పెళ్లి తర్వాత రణ్‌భీర్‌కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటించిన బ్రహ్మాస్త్ర ఈ ఏడాది బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ 9న రిలీజైన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కలిపి 450 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నది.
మూడు ముక్కలైన బ్రహ్మాస్త్రాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడేందుకు డీజే శివ అనే యువకుడు సాగించిన పోరాటాన్ని ఆవిష్కరిస్తూ విజువల్ వండర్‌గా దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో గ్రాఫిక్స్, రణ్‌భీర్, అలియా కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నవంబర్ 4న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదలచేయబోతున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు 85 కోట్లకు డిస్నీ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. నాలుగు వందల కోట్ల బడ్జెట్ కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కించారు.
మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సెకండ్ పార్ట్‌ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌లో అమితాబ్‌బచ్చన్‌తో పాటు నాగార్జున (Nagarjuna) కీలక పాత్రల్లో నటించారు. షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) గెస్ట్ రోల్ చేశాడు. ఈ సినిమా దక్షిణాది వెర్షన్స్‌కు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS rajamouli) ప్రజెంటర్‌గా వ్యవహరించారు.