Bimbisara Trailer: కల్యాణ్‌రామ్‌ రౌద్రరసం.. బింబిసారి నుంచి కొత్త ట్రైలర్‌ చూశారా?-bimbisara new trailer out and this time with more intense action from kalyan ram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bimbisara Trailer: కల్యాణ్‌రామ్‌ రౌద్రరసం.. బింబిసారి నుంచి కొత్త ట్రైలర్‌ చూశారా?

Bimbisara Trailer: కల్యాణ్‌రామ్‌ రౌద్రరసం.. బింబిసారి నుంచి కొత్త ట్రైలర్‌ చూశారా?

HT Telugu Desk HT Telugu
Jul 27, 2022 06:03 PM IST

Bimbisara Trailer: నందమూరి కల్యాణ్‌రామ్‌ తన నట విశ్వరూపం చూపించడానికి వచ్చేస్తున్నాడు. అతని నెక్ట్స్‌ మూవీ బింబిసార నుంచి వచ్చిన కొత్త ట్రైలర్‌ కల్యాణ్‌రామ్‌లోని రౌద్ర రసాన్ని కళ్లకు కట్టింది.

<p>బింబిసారలో నందమూరి కల్యాణ్ రామ్</p>
బింబిసారలో నందమూరి కల్యాణ్ రామ్

కల్యాణ్‌రామ్‌ సరికొత్త అవతారంలో కనిపిస్తున్న మూవీ బింబిసార. ఈ మూవీ ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. తాజాగా బుధవారం (జులై 27) కొత్త ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో కల్యాణ్‌రామ్‌ నటన అతని ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఈ తాజా ట్రైలర్‌లో అతని డైలాగులతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదుర్స్‌ అనిపించేలా ఉంది. ఈ పీరియాడిక్‌ ఫ్యాంటసీ డ్రామాలో రాక్షసరాజు బింబిసారుని పాత్రతోపాటు ఆధునిక కాలంలోని మరో పాత్రలోనూ కల్యాణ్‌రామ్‌ కనిపిస్తున్నాడు. ఈ కొత్త ట్రైలర్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ట్విటర్‌ ద్వారా రిలీజ్ చేశాడు. బింబిసార మూవీని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

ఈ లేటెస్ట్‌ ట్రైలర్‌లో కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుండగా.. అందుకు తగినట్లుగా కల్యాణ్‌ నోటి వెంట పలికిన డైలాగులు ఫ్యాన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. అతని నటన, డైలాగ్‌ డెలివరీ రెండూ కట్టిపడేస్తున్నాయి. ఈ తాజా ట్రైలర్‌ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. "శరణు కోరితే ప్రాణభిక్ష.. ఎదిరిస్తే మరణం" అంటూ అతడు చెప్పే డైలాగ్‌ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలుస్తోంది.

ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ మూవీలో కేథరిన్‌ ట్రెసా.. కల్యాణ్‌రామ్‌ సరసన నటిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కీరవాణి అందించగా.. చిరంతన్‌ భట్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు.

Whats_app_banner