Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌజ్‌ రెడీ.. కంటెస్టెంట్‌ ఫైనల్‌ లిస్ట్ ఇదేనా!-bigg boss season 6 house ready as suspense over contestants continues ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌజ్‌ రెడీ.. కంటెస్టెంట్‌ ఫైనల్‌ లిస్ట్ ఇదేనా!

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హౌజ్‌ రెడీ.. కంటెస్టెంట్‌ ఫైనల్‌ లిస్ట్ ఇదేనా!

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 09:07 PM IST

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కోసం హౌజ్‌ సిద్ధమవుతోంది. మరోవైపు ఈ సీజన్‌లోని కంటెస్టెంట్స్‌ ఫైనల్‌ లిస్ట్‌ ఇదే అంటూ వాళ్ల పేర్లు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తోంది
బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తోంది (twitter)

Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 6కు అంతా సిద్ధమైంది. ఈ మోస్ట్ అవేటెడ్‌ రియాల్టీ షో సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ మధ్యే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో హోస్ట్‌ నాగార్జుననే ఈ షో స్టార్ట్‌ కాబోయే డేట్‌ను తనదైన స్టైల్లో అనౌన్స్‌ చేశాడు.

వరుసగా నాలుగో సీజన్‌ కూడా అతడే హోస్ట్‌ చేయబోతుండటం విశేషం. ఐదో సీజన్‌లాగే ఈసారి కూడా బిగ్‌బాస్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో 24x7 టెలికాస్ట్ కానుండగా.. అటు స్టార్‌ మాలోనూ ప్రతి రోజూ గంట పాటు అలరించనుంది. అయితే ఈసారి హౌజ్‌లోకి అడుగు పెట్టబోయేది ఎవరు అన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. ఇప్పటికే ఎన్నో పేర్లు తెరమీదికి వచ్చాయి.

తాజాగా 20 మంది పేర్లు రాగా.. ఇదే దాదాపుగా ఫైనల్‌ లిస్ట్‌ అని చెబుతున్నారు. అయితే షో ప్రారంభమైన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. వచ్చే ఆదివారమే(సెప్టెంబర్‌ 4) ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పని లేదు. ఈసారి షోలో చాలా వరకూ యాంకర్స్‌తోపాటు యాక్టర్స్‌ కూడా ఉన్నారు.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో స్పెక్యులేట్‌ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండబోతోంది వీళ్లే. ఒకప్పుడు టాలీవుడ్‌లో నటిగా మెరిసిన ఆశా సైనీ, యాంకర్‌ మంజూష, యాంకర్‌ రోహన్‌, సింగర్‌ మోహన భోగరాజు, నటుడు లక్ష్య్‌ చదలవాడ, నటుడు తన్మయ్‌, కొరియోగ్రాఫర్‌ పాపీ మాస్టర్‌, ఫిల్మ్‌ క్రిటిక్‌ విజ్ఞాన్‌ దాసరి, యాంకర్‌ పద్మిని, నటి సంజనా చౌదరి, యూట్యూబ్‌ ఫేమ్‌ కుషితా కల్లపు, కమెడియన్‌ భరత్‌ కుమార్‌, నటుడు కౌషిక్‌, నటి కరుణా భూషణ్‌, నటుడు శ్రీ మంగమ్‌, నటుడు సుమంత్ అశ్విన్‌, నటి ప్రీతి అస్రానీ, నటుడు చైతన్య గరికపాటి, సింగర్లు హేమచంద్ర, శ్రావణ భార్గవి.

వీళ్లే కాకుండా యాంకర్‌ ఉదయభాను, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఆర్జే సూర్య, గీతు రాయల్‌, నేహా చౌదరి, యాంకర్‌ నేహా, కమెడియన్‌ చంటిలాంటి వాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ హౌజ్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. తొలి సీజన్‌ పుణె దగ్గరలోని లోనావాలాలో జరిగినా.. రెండో సీజన్‌ నుంచి హైదరాబాద్‌లోనే ఈ షో నిర్వహిస్తున్నారు.

IPL_Entry_Point