Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి పెళ్లయిన జంట.. ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ 6 షోలో ప్రముఖ గాయకులు హేమచంద్ర-శ్రావణి భార్గవి పాల్గొననున్నారని సమాచారం. ఇప్పటికే సీజన్ 3లో వరుణ్ సందేశ్-రితికా షెరూను పంపగా.. తాజాగా హేమచంద్ర దంపతులను పంపనున్నట్లు సమాచారం.
తెలుగు పాపులర్ టీవీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ రియాల్టీ గేమ్ షో ఇప్పటి వరకు బుల్లితెరపై ఐదు సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సీజన్‌ను నిర్వహించారు. తాజాగా సీజన్ 6లోకి అడుగుపెట్టింది. నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్ షో ప్రేక్షకులను విపీరతంగా ఆకట్టుకుంటోంది. నాగార్జున హోస్టింగ్, సెలబ్రెటీల టాస్కులు, విందులు, వినోదాలతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే ఈ షో కోసం పలువురు సెలబ్రెటీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో పెళ్లయిన ఓ జంట కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే బిగ్‌బాస్ మూడో సీజన్‌లో హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య రితికా షెరూ పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఓ జంటను హౌస్‌లోకి పంపించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇంతకీ హౌస్‌లోకి వెళ్లే ఆ కపుల్ మరెవరో కాదు.. ప్రముఖ గాయకులు హేమచంద్ర-శ్రావణ భార్గవి బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారని ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఇటీవల కాలంలో హేమచంద్ర-శ్రావణ భార్గవి విడిపోతున్నట్లు సామాజిక మధ్యమాల్లో వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఫేక్ అని సదరు నటీ నటులు పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. తాజాగా వీరిద్దరూ బిగ్‌బాస్ సీజన్6లో పాల్గొనబోతున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
ఇటీవలే బిగ్‌బాస్ సీజన్ 6 ప్రోమోను విడుదల చేశారు నిర్వహాకులు. ఇప్పటికే ఈ షోలో పాల్గోనేందుకు పలువురు సెలబ్రెటీలు ఉత్సుకత చూపించారని, మరికొంతమందిని ఎంపిక కూడా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరో విజేతగా నిలుస్తారో తెలియాలంటే సెప్టెంబరు 4 నుంచి ప్రసారం కానుంది.
సంబంధిత కథనం